మూతపడ్డ అన్న క్యాంటీన్ ను
యధావిధిగా కొనసాగిస్తూ 28వ రోజుకు చేరుకున్న అన్న క్యాంటీన్ సామకోటి ఆదినారాయణ


శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం పుట్టపర్తి మున్సిపల్ జిల్లా కేంద్రంలో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించి ఐదు రూపాయలకి పేద ప్రజలకు కడుపు నింపే అన్న క్యాంటీన్లను మూత వేయడం పై,మూతపడ్డ అన్నా క్యాంటీన్ ను ప్రారంభించి… అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో 28వ రోజుకు చేరుకొని చంద్రన్న ఆశయం కోసం ప్రతి పేదవాని ఆకలి తీర్చాలన్నదే శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ ఆశయం.
అనంతరం ఈ సందర్భంగా పత్రిక ముఖంగా మంగళవారం నాడు వారు మాట్లాడుతూ…వ్యవస్థను మార్చాలని రాజకీయాల్లోకి వచ్చిన అన్న నందమూరి తారక రామారావు పేదవానికి కూడు,గూడు,నీడ అనే నినాదంతో ఎన్ని సంక్షోభాలు ఎదురైనా పేదవారి సంక్షేమం కోసం పాటుపడ్డారు.
అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో ప్రతి పేదవాని ఆకలి తీర్చుట కోసం తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందించాలనే అన్నా క్యాంటీన్ల ద్వారా అందించిన ఘనత శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారిదని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్లు తీసివేయడం పేదవాడి కడుపు కొట్టడం దురదృష్టకరమని,పేదవారికోసం అన్న క్యాంటీన్లు ఆనాడు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారనే ఈనాడు వైఎస్ఆర్సిపి అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను నాశనము చేయడం హేమనీయమైన చర్యాని,ప్రతి ఒక్కరికి కడుపు నింపే అన్న క్యాంటీన్లను ఈ వైయస్సార్ ప్రభుత్వం ఎత్తివేయడం చాలా దుర్మార్గానీయమైనదని వైసిపి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
అలాగే ప్రభుత్వ సొమ్ము ఏమైనా ఇస్తున్నారా ఆవ్వాళ పేదోడి కడుపు నింపే పనిలో భాగంగా మాత్రమే ఈరోజు సత్యమ్మ దేవాలయం దగ్గర అన్న క్యాంటిన్లు ప్రారంభించామని,అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదట పేదవాడి కడుపు నింపే అన్న కాంటీన్ ప్రారంభించి,ఈ వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ టిఎన్టియుసి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు,తెలుగుదేశం పార్టీ యువ నాయకులు భార్గవ చౌదరి,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున,గూడూరు శ్రీనివాసులు,బీసీ నాయకులు చెన్నప్ప,వాల్మీకి గంగాద్రి,వెంకట్రాముడు,యువ నాయకులు నాగరాజు,మహేష్,అంజి నాయుడు,మైనార్టీ నాయకులు హుస్సేన్ భాష,రమణ,సంతోష్ తదితరులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.