
మంచి పని కోసం మీరెప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉండండి
ప్రముఖ పర్యావరణ వేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు
మంచి పని ఈ భూమిమీద ఎంతోకష్టమైనది , అది వెంటనే నెరవేరదు ఎన్నో కష్టాలు,ఒడిదుడుకులు కలిగిస్తుంది. అప్పుడే మీరు మీ జీవితం మొత్తాన్ని శక్తిగా, సామర్థ్యం గా,నైపుణ్యంగా మార్చి ఆపనిని నెరవేర్చగలుగుతారు.
అందులో మీ క్షేమం కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఆ నైపుణ్యం మీలో కలుగుతుందో మంచి పనులు నెరవేర్చటంలో శక్తి కలిగి ఉంటారు. అప్పుడే మీ జీవన గమ్యం, లక్ష్యం నెరవేరుతుంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసే మంచిపనికంటే సమస్త జీవరాశుల మేలుకోసం చేసే పని ఎక్కువఫలితాన్నిస్తుంది.
అందుకోసమే సమస్త జీవరాసులకు ఆహారం, ఆక్సిజన్ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్న చెట్లను, అడువులను రక్షించుకోమని తెలియజేశారు, ఇది అన్నింటికంటే అత్యుత్తమమైన, గొప్ప మంచిపనని శాస్త్రాలు సైతం ఘోషిస్తున్నాయి ఎన్నో అనుభవాలు తరువాత నేను ఈ నిర్ణయం తీసుకున్నాను మీరే ఆలోచించండి మీరు మీ శక్తిని మీకుటుంబం కోసం మాత్రమేనా, లేదా కులం కోసమా, మరియు మతం కోసమైనా వాడతారా, లేదా మనుషులందరూ ఒకటే అని అంటారా.
అప్పుడు ఈ భూమిమీద మనుషులు మాత్రమేనా… 84 లక్షల జీవరాసులు ఉన్నాయని మర్చిపోకండి. అందుకే సమస్త జీవరాసులకు ఒకేసారి మేలు చేయగలిగే గొప్ప పనిలో మీ సామర్థ్యాన్ని, శక్తిని వినియోగించండనీ అంటున్నారు ప్రముఖ పర్యావరణ వేత్త కర్మయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు.
HR9NEWS