నిరుద్యోగ నిర్మూలన మహిళలకు భద్రత తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం,గార్మెంట్ పరిశ్రమ లో పనిచేస్తున్న మహిళలతో సమావేశం నిర్వహించిన సవితమ్మ.
శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలోని నిషా గార్మెంట్ పరిశ్రమ వద్ద ఉపాధి పొందుతున్న మహిళలతో సమావేశం నిర్వహించిన పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ .
ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సాధికారత, సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని , మన ప్రాంతం మరింత పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంతోనే సాధ్యమని మహిళలకు మరింత ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ఇటీవల మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కియా పరిశ్రమ వద్ద రా కదలిరా బహిరంగ సభ వేదిక వద్ద పెనుకొండ నియోజకవర్గానికి గార్మెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశపెడుతున్నాము.
అందులో భాగంగా మహిళలకు పెద్దపీట వేశామని 18 నుండి 59 సంవత్సరాలలోపు మహిళలకు ప్రతినెల 1500 రూపాయలు అదేవిధంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ,కుటింబానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తారని కావున వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడుని చేసుకుంటేనే మన ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందని తద్వారా నిరుద్యోగ సమస్య ఉండదని తెలియజేసిన పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ,జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.