దేశవాళీ తుపాకితో వేటకు వెళ్లిన ఇద్దరు అరెస్ట్ అన్నమయ్య జిల్లా మదనపల్లె
దేశవ్యాలి తుపాకీతో వేటకు వెళ్లిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు మదనపల్లె రూరల్ సర్కిల్ సీఐ సద్గురుడు, నిమ్మనపల్లె ఎస్సై లోకేష్ రెడ్డి తెలిపారు
సోమవారం నిమ్మనపల్లె మండలంలోని నాగులయ్యగారిపల్లెకు చెందిన సేకోళ్ళ గిరి (23), గూడుపల్లెకు చెందిన గరివి వెంకటేష్ (25)లు గ్రామానికి సమీపంలోని రైతు బసప్ప వరి పొలాల వద్ద వేటాడు తుండగా దేశవాళి తుపాకీ స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు
పట్టుబడిన నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించి, వారిపై ఆమ్స్ యాక్ట్ కింద కేసు నమోదుచేసి అరెస్టు చేశామని ఎస్ఐ తెలిపారు
