
HR9NEWS ఘనంగా అంతర్జాతీయ టైలర్స్ దినోత్సవ వేడుకలు
హిందూపురం పట్టణంలో స్థానిక టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ టైలర్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కుట్టు మిషన్ ద్వారా కుటుంబ జీవనం సాగిస్తున్న టైలర్ లందరూ సమావేశం ఏర్పాటు చేసుకొని కేక్ కట్ చేసి కుట్టు మిషన్ సృష్టికర్త విలియ న్ హో చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు,
కుట్టు మిషన్ సృష్టికర్త ఆశయానికి అనుగుణంగా ప్రతి టైలర్ ముందుకు సాగి తమ జీవనోపాధి కొనసాగించాలని టైలర్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు, ప్రస్తుత పరిస్థితులలో తమ వృత్తిలో పోటీ తత్వం ఎక్కువ కావడంతో కుటుంబ జీవనాలు గడపడం కూడా కష్టంగా మారిందని ఇలాంటి తరుణంలో ప్రభుత్వాలు టైలర్లకు అన్ని విధాల ఆదుకోవాలనికోరారు
వైసిపి ప్రభుత్వం లో సీఎం జగన్మోహన్ రెడ్డి టైలర్ల సమస్యలు తెలుసుకొని జగనన్న చే దోడుకింద అర్హుత గల టైలర్లకు సంవత్సరానికి10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవడం చాలా అర్జెంట్ తగ్గే విషయమని,ఆయనకు తాము రుణపడి ఉంటామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టైలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డైమండ్ జబీఉల్లా, జిల్లా కార్యదర్శి రఫిక్, డైరెక్టర్ జాఫర్ కార్యవర్గ సభ్యులు అశ్వర్థ ,ఇనాయత్ ,నాగమణి ,హసీనా, రమేష్ రెడ్డి,చాంద్,అన్వర్ తదితరులు పాల్గొన్నారు.