కౌంటింగు రోజున కట్టుదిట్టమైన భద్రతకు సిద్ధమైన పోలీసులు అల్లరి మూకలను చెదరగొట్టేందుకు వినియోగించే ఆయుధాలు, సామాగ్రిని జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పరీక్షించిన పోలీసులు
సార్వత్రిక ఎన్నికల కౌంటింగు రోజు కట్టుదిట్టమైన భద్రతలో భాగంగా పోలీసులు వినియోగించే ఆయుధాలు, పరికరాల సంసిద్ధతను జిల్లా ఎస్పీ గౌతమిశాలి IPS ఈరోజు తనిఖీ చేశారు. శాంతిభద్రతలు విఘాతం కలిగేలా ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నప్పుడు లేదా అల్లర్లు, ఘర్షణలు తలెత్తిన సందర్భాలలో సద్దుమణిచేందుకు మరియు అల్లరి మూకలను చెదరగొట్టేందుకు వాడే గ్యాస్ గన్, యాంటీ రైయిట్ గన్, ప్లాస్టిక్ పెల్లెట్స్, బాల్లిస్టిక్ క్యాట్రిడ్జిలు, తదితరాలను ఈరోజు స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో ఉంచి ఒక్కో ఆయుధం ఎలా పని చేస్తుందో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఏ.ఆర్ అధికారులు, సిబ్బంది పరీక్షించారు
ఏ మేరకు పని చేస్తున్నాయో ఎస్పీ తనిఖీ చేశారు. అన్నీ పక్కాగా పని చేసేలా సిద్ధం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఎట్టిపరిస్థితుల్లోను కౌంటింగు ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా సమిష్టిగా పనిచేయాలని ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సమయంలో అల్లరి మూకలను చెదరగొట్టడానికి తాడిపత్రిలో ఇటీవలే పోలీసులు మాబ్ ఆపరేషన్ పై మాక్ డ్రిల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా. మాబ్ ను చెదరగొట్టేందుకు వినియోగించే ఆయుధాలను పరీక్షించి కౌంటింగు బందోబస్తుకు పోలీసులు సిద్ధమయ్యారు.
ఈకార్యక్రమంలో ఏ.ఆర్ డీఎస్పీ మునిరాజ, ఆర్ ఐ లు రెడ్డెప్పరెడ్డి, రాముడు, మధు, ఆర్ ఎస్ ఐ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు