కన్యాకుమారిలోని ధ్యాన్ మండపంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి 48 గంటల పాటు ధ్యానం చేయాలని నిర్ణయించుకున్నారు.

కన్యాకుమారిలో మోదిజీ 48 గంటల ధ్యానం
కన్యాకుమారిలోని ధ్యాన్ మండపంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి 24 గంటల పాటు ధ్యానం చేయాలని నిర్ణయించుకున్నారు


2024 లోక్‌సభ ఎన్నికల ముగింపు సందర్భంగా మే 30 సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రధాని పూనుకున్నారు.
గత 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత మోడీ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ గుహలను తన ధాన్య కార్యక్రమం కోసం ఎంచుకోగా ఈ సారి స్వామి వివేకానందుడి ధ్యానం చేసిన ప్రదేశాన్ని ఎంచుకున్నారు


ప్రధానమంత్రి ధ్యానం చేయనున్న ఈ స్మారక శిల స్వామి వివేకానంద జీవితంపై పెను ప్రభావం చూపింది. సన్యాసి జీవితంలో గౌతమ బుద్ధుని సారనాథ్‌కు సమానమైన ప్రాముఖ్యత కన్యాకుమారి కలిగి ఉన్నది


వివేకానందుడు దేశమంతటా తిరుగుతూ అభివృద్ధి చెందిన భారతదేశం కోసం కన్యాకుమారి వద్ద మూడు రోజుల పాటు ధ్యానం చేసారు. ఇప్పుడు అదే స్థలంలో ధ్యానం చేసి స్వామిజీ ఆకాంక్షించిన భారత్‌కు జీవం పోయాలన్న నిబద్ధత ప్రధాని మోడీలో కనిపిస్తున్నది. ఆలాగే ఈ ప్రదేశంలో మాత పార్వతీ దేవి పరమ శివుని కోసం ధ్యానం చేసిందని మన పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి.

Leave a Comment