








ఆల్ ఇండియా టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ సత్యసాయి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ మహిళా సేవా పురస్కారాలు
హిందుపురం పట్టణం లోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మహిళా దినోత్సవం సందర్భంగా
ఉత్తమ మహిళా సేవా పురస్కారాల కార్యక్రమం
కల్లూరు మహమ్మద్ ఉమర్ ఫారూక్ ఖాన్ ఆధ్వర్యంలో
జాబిలి చాంద్ బాషా అధ్యక్షతన ఘనంగా జరిగింది
ఆల్ ఇండియా టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ శ్రీ సత్యసాయి జిల్లా రచయితల సంఘం సంయుక్తo గా ఈ కార్యక్రమం నిర్వహించింది.
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథి గా గైనకాలజిస్ట్ డాక్టర్ షర్మిల విశ్రాంత ప్రధానో పాధ్యాయురాలు జీవరత్నమ్మ లైఫ్ వరల్డ్ ఉదయ్ కుమార్ గారు పాల్గొన్నారు ఉమర్ ఫారూక్ ఖాన్ గారు మాట్లాడుతూ స్త్రీ జనోద్ధారకులు ముహమ్మద్ ప్రవక్త సొల్లాల్లహు అలైహి వసొల్లం గారు స్త్రీల హక్కుల గురించి 1500 సంవత్సరాలక్రితం ఉద్యమిస్తూ ఆచారణాత్మక సందేశం ఇచ్చారని ఆ సందేశం.
తల్లిని సేవించు – ఆమె సేవలోనే స్వర్గం ఉంది.
భార్యను ప్రేమించు – బానిసలా చూడకు నిష్కారణంగా హింసించకు, ఆమెలో ఏదైనా లోపం ఉంటే వివేకంతో సంస్కరించు సోదరిని అభిమానించు, నీ ఆస్థిలో ఆమెకూ భాగం ఉందని మరువకు.పరాయి స్త్రీని చెడు దృష్టితో చూడకు. నీ తల్లి, చెల్లి, భార్య కుమార్తెలు కూడా స్త్రీలేనని మరువకు.
ఆడపిల్లను చులకనగా చూడకు, అదృష్టంగా భావించు. వారు దైవకారుణ్యానికి చిహ్నాలు, స్వర్గానికి ద్వారాలు
ఆడపిల్లను (గర్భంలోనే) హత్య చేయకు. అది మహాపాపం దైవం ఆమె పోషణకు మార్గం చూపుతాడు.కట్నం కోసం మహిళలను వేధించకండి. ఆమెకు స్త్రీ ధనాన్ని (మహర్) చెల్లించి వివాహం చేసుకోండి.
స్త్రీని గౌరవించు ఆమె మీ తల్లి, సోదరి, భార్య కుమార్తె ఆమెను అవమానించకు.
ఎక్కడ మహిళల హక్కులు హరించబడతాయో అక్కడ దైవగ్రహం వర్శిస్తుంది.
ఆడపిల్లలు గల వ్యక్తి వారిని పెంచి పోషించి వారిపట్ల బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే దైవం ఆవ్యక్తి స్వర్గం అనుగ్రహిస్తారు.
ఒక స్త్రీ అర్ధరాత్రి నగలు ధరించి నిర్భయంగా, ఒంటరిగా ప్రయాణించిన రోజే మహిళకు నిజమైన రక్షణ లభించినట్లు అని దివ్య సందేశం ఇచ్చారని ఇతర అతిథులు స్త్రీల హక్కులు చట్టాల గురించి మాట్లాడారు ప్రస్తుతం తల్లి తండ్రులు ఆడపిల్లల కోసం చేయాల్సిన పనులు గురించి ఆడపిల్లల ఆత్మ రక్షణ కు కరాటే శిక్షణ గురించి మాట్లాడారు అన్ని రంగాలలో సేవలు చేసిన మహిళలు పారిశుధ్యకార్మికులు. డాక్టర్లు. నర్సులు. బ్లడ్ బ్యాంకు ఉద్యోగులు.
మహిళా కరాటే ట్రైనర్లు. అంగన్వాడీ వర్కర్ లు. వాలంటీర్ లు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో పనిచేసిన మహిళా ఉద్యోగి. న్యాయవాదులు.బెస్ట్ స్పీకర్ లు. విశ్రాంత ఉపాధ్యాయులు. కవయిత్రి. రచయిత్రులు. సామాజిక సేవకులు.
ఎయిడ్స్ స్వచ్చంద సేవకులు.దివ్యాo గులు.తదితరులకు ముఖ్య అతిథి విశిష్ట అతిథుల చేత పుర ప్రముఖుల చేతుల మీద ఉత్తమ మహిళా సేవా పురస్కారాలు అందించారు.
ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులు గా సామాజిక సేవకులు చైతన్య గంగిరెడ్డి.నాగిరెడ్డి. హారూన్ రశీ ద్. టిప్పు సుల్తాన్ నాయకులు మునావీర్ డాక్టర్ గంగ రత్నమ్మ డాక్టర్ గాయత్రి. న్యాయవాదులు కళావతి. సంతోషీ.ఆర్మీ జవాన్ శైలజ.మాడుగుల సులోచనా దేవి. ఉసామాఖాన్. ఫైరోజ్ ఖాన్. తదితరులు పాల్గొన్నారు