టాటూతో బ్లడ్ క్యాన్సర్ ముప్పు

టాటూతో బ్లడ్ క్యాన్సర్ ముప్పు శరీరంపై వేసుకొనే టాటూలతో లింఫోమా అనే బ్లడ్‌ క్యాన్సర్‌ వచ్చే ముప్పు 21 శాతం వరకూ ఉంటుందని స్వీడన్‌ పరిశోధకులు తెలిపారు లింఫోమా బ్లడ్‌ క్యాన్సర్‌ బారినపడిన 2,938 మందితో కలిపి మొత్తంగా 11,905 మందిపై ఈ అధ్యయనం చేశారు. టాటూలు వేసుకోని వారితో పోలిస్తే, వేసుకొన్న వారిలో క్యాన్సర్‌ కణాల వృద్ధి ఎక్కువ వేగంగా జరిగినట్టు పరిశోధకులు తేల్చారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు.