T Mahesh

కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్డీయే కూటమి నేతలు సమావేశమయ్యారు. దాదాపు గంట సేపు కొనసాగిన ఈ సమావేశంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం రాష్ట్రపతిని కలవనున్నారు
T Mahesh
న్యూఢిల్లీ, ఈవార్తలు : ( New Prime Minister of India ) అన్ని పార్టీలకు విలక్షణ ఫలితాలు అందించిన ప్రజలు.. ఏ పార్టీని అక్కున చేర్చుకోలేదు. కొరఢా ఝలిపిస్తూనే, సరిగ్గా పాలన చేసుకోవాలని సూచించారు. దాని పర్యవసానమే.. బీజేపీ తన మిత్రపక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి
తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 241 సీట్లను గెలుచుకోగా, ఎన్డీయే కూటమి 292 సీట్లు గెలుచుకొన్నది. బీజేపీ సొంతంగా 272 మార్కును అందుకోలేకపోయింది. అయితే, మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ రోజు మోదీ సర్కారు కేంద్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి, ప్రభుత్వ రద్దుకు రాష్ట్రపతికి సిఫార్సు చేశారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు
