పెనుకొండ,శ్రీ సత్యసాయి జిల్లా,
వేదిక-గగన్ మహల్-పెనుకొండలో
కవితాయాత్ర అభినందన సభ,
భారత జాతి సమైక్య వేదిక ప్రారంభ సభ జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణ దేవరాయల రాయల రెండవ రాజధానిలో ‘కవితాయాత్ర’లో హిందూపురం, కవులు రచయితలు భాగస్వాములైనారు పెనుకొండలో సత్యసాయి జిల్లా రచయితల సంఘ ఆధ్వర్యంలో మూడు విడతలుగా ‘కవితాయాత్ర’సాహిత్య /కార్యక్రమం జరిగింది. సుమారు 60 మంది రచయితలు వివిధ ప్రాంతాలనుoచి విచ్చేసి కవితా యాత్రలో పాల్గొన్నారు. మొదట కవితాయాత్ర సమావేశం పెనుకొండలోని దర్గాలో మతసామరస్యం పై జరిగింది . ఆ గోష్ఠికి హిందూపురం నియోజక వర్గ అధ్యక్షులు కవి రచయిత కల్లూరు రాఘువేంద్ర రావు. అధ్యక్షతవహించారు. తెలుగు భాషా సాహితీ సాంస్కృతిక సేవలకు హిందుపురం వాసులు కవి రచయిత కల్లూరు రాఘువేంద్ర రావు. కల్లూరు ఉమర్ ఫారూక్ ఖాన్. ఆంధ్రరత్న గంగాధర్ తదితరులకు శ్రీ సత్యసాయి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలోశ్రీ కృష్ణదేవరాయల రెండవ రాజధాని పెనుకొండ
సాహీతీ కవితా యాత్ర కార్యక్రమం లో విశిష్ట అతిథుల చేతుల మీద రాయల సాహితీ పురస్కారం
అందజేస్తూ సత్కరిoచారు.
శ్రీశ్రీశ్రీ తాజ్ బాబా గారు వంశపారంపర్య పీఠ అధిపతి సహకారంతో జరిగిన కార్యక్రమంలో త్వరలో భారత జాతి సమైక్యతా వేదిక సూఫీ సత్పురుషుల జాతీయ సమైక్యతా సంస్థ మత సామరస్యం పరమత సహనం సోదరభావం వసుధైక కుటుంబ నిర్మాణం జాతీయ సమైక్యత దేశ సుస్థిరత కోసం క్రియాశీలక కార్య నిర్వహణ కోసం చర్చలు చేస్తూ ఈ కార్యక్రమంలో కవితా యాత్ర లో దేశ భక్తి దేశ భవిష్యత్తు దేశ నిర్మాణం మరియు మత సామరస్యం గురించి రెండు రాష్ట్రాల కవులు రచయితలు చర్చించారు. ఈ కార్యక్రమం లో ఆధ్యాత్మిక గురువులు తాజ్ సుల్తాన్ బాబా -పీఠాధిపతి, బాబయ్య స్వామి దర్గా. శ్రీ రవిశంకర గురూజి-సిద్ది సమాధియోగా గురువుశ్రీకృష్ణ దేవరా యల విశ్వవిద్యా లయం తెలుగుశాఖాధ్యక్షులు ప్రొ.బాలసుబ్రమణ్యం,కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డి.కె.చదువుల బాబు కేంద్ర సాహిత్యఅకాడమీ యువపురస్కార గ్రహీత డా.వేంపల్లి షరీఫ్ ప్రముఖ బాలసాహితీ వేత్త, ఆత్మీయ అతిథులుగా డా. షమీవుల్లా, సుమనా జయంతి, అంకె శ్రీనివాసులు, కొత్తపల్లి సురేష్ బాబు, శ్రీ పండిట్ జాన్ ప్రియనాథ్-డైరెక్టర్,డిస్ట్రిక్ట్ హ్యూమన్ రైట్స్
కె.శ్రీనివాసులు-అధ్యక్షులు, మిట్టాంజనేయ టెంపుల్ డెవలప్ మెంట్శ్రీ, యు.శ్రీనివాసులు-కమిటీ మెంబర్, శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీ యం.ఆర్.హనుమంతు- దళిత హక్కుల పరిరక్షణ వేదిక తదితరులు పాల్గొన్నారు.