BREAKING: ముంబై తాజ్ హోటల్ కు బాంబు
బెదిరింపు

ముంబై తాజ్ హోటల్ కు బాంబు
బెదిరింపు

దేశంలో ఇటీవల బాంబు బెదిరింపులు కలకలం
రేపుతున్నాయి. తాజాగా ముంబైలోని తాజ్
హోటల్, ఛత్రపతి శివాజీ మహరాజ్
అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు
బెదిరింపు కాల్స్ వచ్చాయి

దీంతో
అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాల్లో
సోదాలు నిర్వహించగా అనుమానాస్పదంగా
ఏమీ కనిపించకపోవడంతో ఊపిరి
పీల్చుకున్నారు. ఆ కాల్ యూపీ నుంచి
వచ్చిందని, నిందుతుడి కోసం గాలిస్తున్నట్లు
తెలిపారు

మహా విషాదం 2000 దాటిన మరణాలు

మహా విషాదం.. 2వేలు దాటిన మరణాలు

పపువా న్యూగినియా:

ఇండోనేషియాకు సమీపంలో ఉండే పపువా న్యూగినియాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరణాల సంఖ్య 2వేలు దాటింది.

శుక్రవారం తెల్లవారుజామున భారీగా కొండచరియలు విరిగి పడ్డాయి.
ఈ ఘటనలో మరణాలు 2 వేలు దాటినట్లు ఆ దేశం ఐక్యరాజ్య సమితికి నివేదిక సమర్పించింది.

భారీగా నష్టం వాటిల్లిందని, ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు సహాయక చర్యలు
కొనసాగుతున్నాయి.కొండలను ఆనుకొని గ్రామాలు ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉంది.

ఆర్టీవో ఆఫీస్ నుండి జారీ చేయాలి సిఐటియు

డ్రైవింగ్ లైసెన్సులను ప్రభుత్వం ద్వారానే ఆర్టీవో ఆఫీస్ నుండి జారీ చేయాలి . ట్రాన్స్ పోర్టు జిల్లా ప్రధాన కార్యదర్శి పెడబల్లి బాబా పెనుకొండ పట్టణం సిఐటియు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి ఈ సందర్భంగా ట్రాన్స్ ఫోర్ట్ రంగం జిల్లా ప్రధాన కార్యదర్శి పెడపల్లి బాబా మాట్లాడుతూ

జూన్ 1 నుండి ప్రైవేట్ సంస్థల ద్వారా డ్రైవింగ్ లైసెన్సులను ఇవ్వాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలను ప్రవేశపరం చేయాలనే నిజములో భాగంగా ట్రాన్స్పోర్ట్ రంగానికి గుండెకాయగా ఉండే

ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తూ ప్రజల భద్రత రిత్యా డ్రైవింగ్ లైసెన్స్ ను జారీ చేసే సందర్భంలో అనేక కొలమానాలతో ఎ డ్యూ కేట్ చేసే విధానాన్ని తుంగలో తొక్కి ప్రైవేట్ సంస్థలకు డ్రైవింగ్ లైసెన్సులను ఇచ్చే అనుమతి (2024 జూన్ 1 నుండి) నిర్ణయాన్ని సిఐటియు

జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ

ప్రజల భద్రతకు ప్రాణాలకు సంబంధం కలిగి ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ లోనూ డబ్బే కొలమానంగా బాధ్యత రహితంగా ఉండే ప్రైవేట్ సంస్థలకు డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేసే అవకాశాన్ని కల్పించడం అంటే ప్రజల భద్రతకు ప్రాణాలకు కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ నిర్ణయం ద్వారా తెలుస్తుంది

అదేవిధంగా ఆర్టీవో ఆఫీస్ నిర్వహణలో కీలకమైన డ్రైవింగ్ లైసెన్సుల మంజూరు ప్రభుత్వానికి పెద్ద ఆదాయ వనరుగా ఉంది డ్రైవింగ్ లైసెన్సులను ఆర్టీవో ఆఫీసుల నుండి తొలగిస్తే ఆర్టీవో ఆఫీసులో నష్టాల్లోకి వెళ్తుంది. తద్వారా పూర్తిగా ప్రస్తుత ట్రాన్స్ పోర్ట్ రంగం సర్వీసులను ప్రైవేటుపరం చేయాలని దుర్మార్గ ఆలోచన ప్రభుత్వం చేస్తుంది

తద్వారా ప్రజల పైన టాక్స్ ల రూపంలో బారాలు పడతాయి కావున ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం

లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్టీవో కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా తెలియజేశారు

ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బాబావలి, మా భాష, ఆటో యూనియన్ నాయకులు తిప్పన్నా, నాగప్ప, షరీఫ్, రాజగోపాల్, రంగప్ప తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం జిల్లా ఉరవకొండ వజ్రకూరు మండలం వజ్రాల వేట

అనంతపురం జిల్లా ఉరవకొండ  వజ్రకరూరు మండలం వజ్రాలు వేట


వజ్రాలు దొరుకుతున్నాయోచ్.. చిన్న రాయి దొరికినా చాలు లైఫ్ సెటిలయిపోయినట్లే.. ఎక్కడంటే


రాయలసీమ రతనాల సీమ..అంటారు.. ఇప్పుడు నిజంగా రతనాల సీమ మాదిరిగానే మారింది

సాధారణంగా మట్టిలో రాళ్లు రప్పలు కనిపిస్తుంటాయి.. కానీ.. ఇక్కడ మాత్రం వజ్రాలు కనిపిస్తుంటాయి.. అదికూడా వర్షా కాలంలో మాత్రమే

సాధారణంగా వర్షం పడితే మట్టి వాసన రావడం సహజం.. కానీ రాయలసీమలో మాత్రం నాలుగు చినుకులు పడితే చాలు మ‌ట్టి నుంచి వ‌జ్రాలు బయటపడతాయి

వేప చెట్లకు మామిడికాయలు

వేపచెట్టుకు మామిడికాయలు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఓ వింత దృశ్యం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది రాష్ట్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ నివాసంలోని వేపచెట్టుకు మామిడి కాయలు కాసిన వీడియో వైరల్గా మారింది ఈ వీడియోను ఆయనే Xలో పోస్ట్ చేశారు. దీనిని చూసి ఆశ్చర్య పోయినట్లు ప్రహ్లాద్ పేర్కొన్నారు కాగా వేప కొమ్మపై మామిడి పూత పడటంతోనే ఇలా జరిగి ఉంటుందని వృక్ష శాస్త్రజ్ఞులు తెలిపారు

రైతుకి పొలంలో దొరికిన విలువైన వజ్రాల వేటలో రైతు సక్సెస్ అయ్యారు

కర్నూలు: రైతుకి పొలంలో దొరికిన విలువైన వజ్రం

కర్నూలు జిల్లాలో వజ్రాల వేటలో రైతు సక్సెస్ అయ్యారు.. పొలం పనులు చేస్తున్న సమయంలో ఆయనకు ఓ వజ్రం దొరికింది

వెంటనే వ్యాపారులు వేలంపాట నిర్వహించగా  భారీ ధరకు ఓ వ్యాపారి దక్కించుకున్నారు. డబ్బులు, బంగారాన్ని ఆ రైతుకు చెల్లించి వజ్రాన్ని వ్యాపారి దక్కించుకున్నారు

కర్నూలు జిల్లా ఒక్కటే మాత్రమే కాదు అటు అనంతపురం జిల్లాలోని పొలాలు, స్థలాల్లో కూడా ఈ వజ్రాల వేట కొనసాగుతోంది.కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కొనసాగుతోంది

గత వారం రోజులుగా జనాలు పొలాల్లో వజ్రాల కోసం గాలిస్తున్నారు.. ఈ క్రమంలో ఓ రైతును అదృష్టం వరించింది. పొలంలో పనులు చేస్తుండగా ఓ వజ్రం దొరికింది

జీవితమే మారిపోయింది. కర్నూలు జిల్లా మద్దెకర మండలం హంప గ్రామంలో ఓ రైతు పొలం పనులు చేసుకుంటున్నాడు. అతడికి పొలంలో ఓ వజ్రం దొరకగా

పెరవలికి చెందిన వ్యాపారి వేలం పాటలో రూ.5 లక్షలు, రెండు గ్రాముల బంగారం రైతుకు ఇచ్చి ఆ వజ్రాన్ని దక్కించుకున్నాడు

అయితే బయట మార్కెట్‌లో ఆ వజ్రం విలువ ఇంకా ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

కేవలం ఒకే ఒక్క నిమిషంలోనే ఫోన్ చార్జింగ్

ఒక్క నిమిషంలోనే ఫోన్ చార్జింగ్

ఈ కొత్త సాంకేతికతను ఈ టెక్నాలజీ ద్వారా లాప్టాప్ మొబైల్ ఫోన్లకు ఒక నిమిషంలోనే చార్జింగ్

కేవలం ఒకే ఒక్క నిమిషంలో ఫోన్‌కు 0 నుంచి 100 శాతం వరకు చార్జ్ చేయగలిగే

కొత్త సాంకేతికతను కొలరాడో యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అంకుర్ గుప్తా అభివృద్ధి చేశారు.

ఈ టెక్నాలజీ ద్వారా ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లకు ఒక్క నిమిషంలో,

ఎలక్ట్రిక్ కారుకు 10 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్ చేయొచ్చని తెలిపారు.

విద్యుత్ గ్రిడ్లలో వేగంగా విద్యుత్తును నిల్వ చేయడానికి కూడా ఈ సాంకేతికత ఉపయోగపడుతుందన్నారు.

ధర్మవరం  మీదుగా రెండు ప్రత్యేక రైలు

ధర్మవరం మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు

వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ ధర్మవరం మీదుగా రెండు రైళ్లను నడుపుతోంది. యశ్వంతపూర్ నుంచి కాచిగూడ మీదుగా గయకు (06217/18) రైలు శనివారం వెళ్తుంది

మరో రైలు యశ్వంతపూర్ నుంచి విజయవాడ మీదుగా హౌరా(02864/63) మధ్య వారానికి ఒక రోజు నడుస్తుంది

రద్దీ దృష్ట్యా ఈ రెండు రైళ్లు ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి

వీటిని జూన్ తర్వాత కూడా కొనసాగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

దేశవాళీ తుపాకితో వేటకు వెళ్లిన ఇద్దరు అరెస్ట్ అన్నమయ్య జిల్లా మదనపల్లె

దేశవాళీ తుపాకితో వేటకు వెళ్లిన ఇద్దరు అరెస్ట్ అన్నమయ్య జిల్లా మదనపల్లె

దేశవ్యాలి తుపాకీతో వేటకు వెళ్లిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు మదనపల్లె రూరల్ సర్కిల్ సీఐ సద్గురుడు, నిమ్మనపల్లె ఎస్సై లోకేష్ రెడ్డి తెలిపారు

సోమవారం నిమ్మనపల్లె మండలంలోని నాగులయ్యగారిపల్లెకు చెందిన సేకోళ్ళ గిరి (23), గూడుపల్లెకు చెందిన గరివి వెంకటేష్ (25)లు గ్రామానికి సమీపంలోని రైతు బసప్ప వరి పొలాల వద్ద వేటాడు తుండగా దేశవాళి తుపాకీ స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు

పట్టుబడిన నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించి, వారిపై ఆమ్స్ యాక్ట్ కింద కేసు నమోదుచేసి అరెస్టు చేశామని ఎస్ఐ తెలిపారు

పరిగి మండలంలో లూజ్ పెట్రోల్ అమ్మితే చర్యలు-ఎస్ఐ సత్యనారాయణ

పరిగి మండలం లో: లూజ్ పెట్రోల్ అమ్మితే చర్యలు : ఎస్ఐ సత్యనారాయణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా ఎలక్షన్ కమిషన్ లూస్ పెట్రోల్ 1 అమ్మకూడదని నిషేదాజ్ఞలు విధించింది. మాచర్ల తదితర ప్రాంతాల్లో పె ట్రోల్ – బాంబులను విసురుకుంటూ వీరంగం సృష్టించడం, అల్లర్లు సృష్టించడం, 1 ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం లాంటి స Oఘటనలు • జరిగినందున ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 4వ … Read more