జిల్లాలో హింసాత్మక ఘటనలకు తావులేకుండా కౌంటింగు రోజున పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా ఎస్పీ గౌతమిశాలి IPS
చట్ట వ్యతిరేక, అసాంఘిక శక్తుల ఏరివేత కోసమే కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు
అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమిశాలి IPS
జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్ల పరిధిల్లో ఈరోజు ఆరు చోట్ల కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లు నిర్వహించిన పోలీసులు
ఇదివరకే కేసులు ఉండటంతో పాటు ఈ ఎన్నికలలో ఘర్షణలకు పాల్పడిన 09 మందిపై రౌడీషీట్లు ఓపెన్
సమస్యలు సృష్టించే వీలున్న వారు, చెడు నడత కల్గిన వారిపై ముందస్తు చర్యలులో భాగంగా 795 మందిపై బౌండోవర్లు
కౌంటింగు వేళ ఎలాంటి అల్లర్లు, ఘర్షణలకు వెళ్లొద్దని… ప్రశాంతంగా మెలగాలని సూచిస్తూ 141 మంది ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లకు కౌన్సెలింగ్
ప్రజల్లో ధైర్యం నింపడం… పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంచడానికి 12 చోట్ల ఫ్లాగ్ మార్చ్ లు
అల్లర్లు, ఘర్షణలు జోలికెళ్లకుండా ప్రజలలో చైతన్యం తేవడానికి 12 చోట్ల గ్రామసభలు
జిల్లా ఎస్పీ గౌతమి శాలి ఐపీఎస్
కౌంటింగు రోజున హింసాత్మక ఘటనలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోండి
జిల్లా ఎస్పీ గౌతమిశాలి IPS
జిల్లాలోని ఎస్సై, ఆపై స్థాయి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎస్పీ
జిల్లాలో హింసాత్మక ఘటనలకు తావులేకుండా కౌంటింగు రోజున పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా ఎస్పీ గౌతమిశాలి IPS ఆదేశించారు
జిల్లాలోని ఎస్సై, ఆపై స్థాయి అధికారులతో ఎస్పీ తన క్యాంపు కార్యాలయం నుండీ ఈరోజు జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రస్తుతం కొనసాగుతోన్న భద్రతా చర్యలను సమీక్షించారు
కౌంటింగు రోజున ఎలాంటి చర్యలు చేపట్టాలో దిశానిర్ధేశం చేశారు. కార్యాచరణ ప్రణాళికలతో జిల్లాలో ఎక్కడా శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టాలన్నారు
ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రౌడీషీటర్లు, కిరాయి హంతకులు, చెడునడత కల్గిన వారిని, సమస్యలు సృష్టించే ట్రబుల్ మాంగర్స్ ను ఎవర్నీ వదలకుండా ముందస్తు చర్యలులో భాగంగా బౌండోవర్లు చేయించాలన్నారు
ఇదివరకే కేసులు ఉండి ఇటీవల జరిగిన ఎన్నికలలో ఘర్షణలకు దిగిన వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేయాలని ఆదేశించారు. ఫ్యాక్షన్ ప్రభావిత సమస్యాత్మక గ్రామాల్లో పోలీసు పికెట్లు పటిష్టంగా నిర్వహించి ఆయా గ్రామాల్లోని తాజా పరిస్థితులపై సమాచారం సేకరించి తగు చర్యలు తీసుకోవాలన్నారు
ఫ్లాగ్ మార్చ్ లు, కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు, వాహనాల తనిఖీలు, గ్రామసభలు నిర్వహించడం విస్తృతం చేయాలన్నారు. డ్రోన్లు వినియోగించి ఫలితాలు వెల్లడయ్యాక విజయోత్సవ ర్యాలీలు నిర్వహించే వారిపై చట్టపరంగా చర్యలు చేపట్టాలన్నారు
144 సెక్షన్ తు.చ తప్పకుండా అమలు చేయాలని… ఐదుగురి కంటే మించి గుమిగూడితే ఉల్లంఘనల కింద చట్టపరంగా ముందుకెళ్లాలని సూచించారు. ఎన్నికల పోటీ అభ్యర్థుల నివాసాలు, పరిసరాలలో భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటు సిసికెమేరాల పర్యవేక్షించాలన్నారు.