ఈ ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి

జూన్ 1వ తేదీన ఆఖరిగా 7వ విడత ఎన్నికలు జూన్ 1 సాయంత్రం ఎగ్జిట్ ఫలితాలు విడుదల జూన్ 4న ఇంతవరకు 7 విడతల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు నాలుగో విడతలోనే అత్యధిక పోలింగ్ జరిగిందని, ఇప్పటివరకు జరిగిన ఆరు విడతల ఎన్నికల్లో నాలుగో విడతలోనే అత్యధికంగా 69.16 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. అత్యల్పంగా ఐదో విడతలో 62.20 శాతం ఓటింగ్ జరిగినట్లు పేర్కొంది. మొత్తం 543 లోక్సభ స్థానాల కు గానూ ఇప్పటివరకు … Read more

నటి హేమకు మరోసారి నోటీసులు

నటి హేమకు మరోసారి నోటీసులుబెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకుబెంగళూరు సీసీబీ మరోసారి నోటీసులు జారీచేశారు. జూన్ 1న విచారణకు హాజరుకావాలనినోటీసుల్లో పేర్కొంది హేమతో పాటు మరో 8మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.కాగా, ఇప్పటికే ఆమెకు నోటీసులు ఇవ్వగాఅనారోగ్య కారణాలతో విచారణకుహాజరుకాలేదు. మరి తాజా నోటీసులకు ఆమెఎలా స్పందిస్తారు అన్నది వేచి చూడాలి

ఈనెల 31న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ

ఈనెల 31న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ పోలింగ్ జరిగిన తీరు, అనంతరం జరిగిన పరిణామాలను సమీక్షించనున్న ఇరువురు నేతలు.. 31న బీజేపీ నేతలు కూడా చంద్రబాబుని కలిసే అవకాశం.. ఈ ఉదయమే విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు.. రేపు రాత్రికి అమరావతికి రానున్న చంద్రబాబు.

మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌  క్లారిటీ ఇచ్చారు

కాంగ్రెస్ లోకి రఘురాం రాజన్..?” ఆర్బీఐ మాజీ గవర్నర్ ఏమన్నారంటే న్యూ ఢిల్లీ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని వస్తోన్న వార్తలపై రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌  క్లారిటీ ఇచ్చారు.. తాను రాజకీయాల్లోకి రావడం తన కుటుంబానికి ఇష్టం లేదన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ పై తనకున్న అభిప్రాయం, ఆయనకు సూచనలు చేశారంటూ వస్తోన్న వార్తలపైనా స్పందించారు.. ”ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నా ప్రజలు ఇంకా నన్ను … Read more

కాంగ్రెస్ లోకి రఘురాం రాజన్ ఆర్బీఐ మాజీ గవర్నర్ ఏమన్నారంటే

కాంగ్రెస్ లోకి రఘురాం రాజన్ ఆర్బీఐ మాజీ గవర్నర్ ఏమన్నారంటే దిల్లీ:కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని వస్తోన్న వార్తలపై రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ (Raghuram Rajan) క్లారిటీ ఇచ్చారు తాను రాజకీయాల్లోకి రావడం తన కుటుంబానికి ఇష్టం లేదన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై తనకున్న అభిప్రాయం, ఆయనకు సూచనలు చేశారంటూ వస్తోన్న వార్తలపైనా స్పందించారు ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నా ప్రజలు ఇంకా నన్ను … Read more

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం. పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి కామెంట్స్. ఈవిఎంలలో ఫలితాలు నిక్షిప్తమయ్యాక ఊహాగానాలతో లాభమేంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తమకే పడ్డాయని టిడిపి ప్రచారం చేసుకుంటోంది.ఎన్నికల కమీషన్ అంపైర్ లాగా వ్యవహరించలేదు ఎన్నికల కమీషన్ అంపైర్ లాగా వ్యవహరించలేదు చంద్రబాబు వైరస్ తో ఎన్నికల కమీషన్ ఇన్ ఫెక్ట్ అయింది. బెట్టింగ్ లో కోసం,సోషల్ మీడియా లో ప్రచారం కోసం మేము ప్రయత్నాలు చేయడం లేదు. నార్త్ … Read more

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కి హై కోర్టులో ఊరట

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కి హై కోర్టులో ఊరట పల్నాడు మాచర్ల వైసీపీ MLA అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కి హైకోర్టు ఊరట కలిగించింది.  3 కేసుల్లో మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దనిపోలీసులను ఆదేశించింది.

యుగ‌పురుషుడు ఎన్టీఆర్‌

యుగ‌పురుషుడు ఎన్టీఆర్‌  101 ఎన్టీఆర్ జ‌యంతి వేడుకలు
టీడీపీ కార్యాల‌యం, మాజీ మంత్రి నారాయ‌ణ క్యాంప్ కార్యాల‌యంలో సంబ‌రాలు
స్వ‌ర్గీయ ఎన్టీ రామారావు విగ్ర‌హానికి ఘ‌న నివాళులర్పించిన‌ టీడీపీ నేత‌లు
కేక్ క‌ట్ చేసి ఒక‌రికొక‌రు తినిపించుకున్న నాయ‌కులు
జై ఎన్టీఆర్‌…జై ఎన్టీఆర్ అంటూ హోరెత్తిన నినాదాలు

నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాల‌యంతోపాటు… గోమ‌తి న‌గ‌ర్‌లోని మాజీ మంత్రి నారాయ‌ణ క్యాంప్ కార్యాల‌యంలో

పార్టీ జిల్లా అధ్య‌క్షుడు షేక్ అబ్ధుల్ అజీజ్ ఆధ్వ‌ర్యంలో తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి, స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు 101వ‌ జ‌యంతి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు

ఈ కార్య‌క్ర‌మంలో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీద ర‌విచంద్ర‌, మాజీ మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌, తాళ్ల‌పాక ర‌మేష్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి, మాజీ మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ తాళ్ల‌పాక అనూరాధ‌, న‌గ‌రాధ్య‌క్షుడు మామిడాల మ‌ధు, మాలేపాటి సుబ్బానాయుడు, కంభం విజ‌య‌రామిరెడ్డి, వేమిరెడ్డి విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి టీడీపీ ముఖ్య నేత‌లు పాల్గొన్నారు

ముందుగా ఎన్టీఆర్ కాంస్య విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి ఘ‌న నివాళుల‌ర్పించారు.  ఎన్టీఆర్ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని కేక్ ను క‌ట్ చేసి ఒక‌రికొక‌రు తినిపించుకున్నారు. జిందాబాద్‌ తెలుగుదేశం…జై ఎన్టీఆర్…సాధిస్తాం…సాధిస్తాం ఎన్టీఆర్ ఆశ‌యాల‌ను  అంటూ నినాదాలు హోరెత్తించారు.

అనంత‌రం డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ మీడియాతో మాట్లాడుతూ… నంద‌మూరి తార‌క రామారావు 101వ జ‌యంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘ‌నంగా జ‌రుపుకుంటున్నార‌న్నారు

ఎల‌క్ష‌న్ కోడ్ ఉండ‌డం వ‌ల్ల‌… జ‌యంతి కార్య‌క్ర‌మాల‌ను పార్టీ కార్యాల‌యాల్లోనే నిర్వ‌హించుకుంటున్నామ‌ని తెలిపారు. సినీ రంగంలోనే రాకుండా…రాజ‌కీయ రంగంలోనూ అనేక విప్ల‌వాత్మక మార్పులు ఏకైక నాయ‌కుడు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ అని కొనియాడారు

అదే విధంగా పేద బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల కోసం ఎంతో సేవ చేశార‌న్నారు. భూమి మీద ఉన్న ప్ర‌తీ ఒక్క‌రికి కూడు, గుడ్డ‌, నీడ ఉండాల‌న్న‌దే ఆయ‌న ఆశ‌య‌మ‌న్నారు. ప్ర‌తీ పేద‌వాడికి సొంత ఇల్లు ఉండాల‌నే కార్య‌క్ర‌మాల‌ను ఆయ‌న తీసుకువ‌చ్చార‌ని గుర్తు చేశారు

ఆ కార్య‌క్ర‌మాల‌ను భార‌త దేశంలోని అన్నీ రాష్ట్రాల్లో అమ‌ల‌వుతున్నాయ‌న్నారు. అదే విధంగా విద్యార్థుల చ‌దువుల కోసం రెసిడెన్షియ‌ల్ కాలేజీల‌ను ప్రారంభించింది…లోక‌ల్ బాడీ ఎల‌క్ష‌న్‌లో రిజ‌ర్వేష‌న్ వంటి వాటిని తీసుకువ‌చ్చింది  ఎన్టీ రామారావు అని పేర్కొన్నారు

ఇలా ఆయ‌న అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చార‌ని… వాట‌న్నింటిని గ‌త 14 ఏళ్లుగా  మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు అమ‌లు చేస్తున్నార‌న్నారు. తెలుగువారి ఆత్మ గౌర‌వాన్ని ప్ర‌పంచ‌మంతా చాటి చెప్పిన‌  గొప్ప వ్య‌క్తి అని అన్నారు. ఆయ‌న యుగ‌పురుషుడ‌ని అన్నారు. ప్ర‌జాస్వామ్యాన్ని కూడా తీసుకువ‌చ్చింది ఎన్టీఆరేన‌న్నారు.

తాళ్ల‌పాక ర‌మేష్‌రెడ్డి మాట్లాడుతూ… మా దైవం స్వ‌ర్గీయ ఎన్టీఆర్ జ‌యంతిని ఘ‌నంగా జ‌రుపుకొని ఆయ‌న‌కి  నివాళుల‌ర్పించ‌డం జ‌రిగింద‌న్నారు. ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని…ఆయ‌న స్థాపించిన క‌ల‌క‌లం వ‌ర్ధిల్లాల‌ని ఆకాంక్షించారు. జూన్ 4న విడుద‌ల‌య్యే ఫ‌లితాల్లో అన్న ఆశీస్సుల‌తో తెలుగుదేశం పార్టీ ఘ‌న విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని ర‌మేష్‌రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు

పేద‌ల‌ను ఆదుకున్న ఏకైక నాయ‌కుడు ఎన్టీ రామారావు అని తెలిపారు. అదే కోవ‌లో చంద్ర‌బాబునాయుడు ప‌ని చేసి తెలుగుదేశం పార్టీకి ఉజ్వ‌ల భ‌విష్య‌త్ తీసుకువ‌స్తార‌న్నారు.

అబ్ధుల్ అజీజ్ మాట్లాడుతూ….శ‌తాబ్ధి జ‌యంతుల‌ను జ‌రుపుకుంటున్నామంటే వారు మ‌హానుభావులు అని…కార‌జ‌న్ముల‌ని… ఆయ‌నే నంద‌మూరి తార‌క రామారావు అని చెప్పారు. తెలుగుజాతి ఉన్న‌న్ని సంవ‌త్స‌రాలు…రాబోయే త‌రాల వారు కూడా ఎన్టీఆర్‌ని గుర్తు పెట్టుకుంటార‌న్నారు

తెలుగుజాతికే గౌర‌వం తెచ్చిన వ్య‌క్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. సినీ రంగంలోనే హీరో కాద‌ని…ఆయ‌న నిజ జీవితంలోనూ హీరో అని కొనియాడారు. మ‌ళ్లీ ఎన్టీఆర్ ఆశ‌యాల‌ను పూర్తి చేసే ప్ర‌భుత్వం…తెలుగుదేశం ప్ర‌భుత్వం అని…అది కాబోయే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ద్వారా జ‌ర‌గ‌బోతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

బీద ర‌విచంద్ర మాట్లాడుతూ… తెలుగుజాతి కీర్తి ప్రతిష్టలను ప్రపంచ నలుదిశలా ఎలుగెత్తి చాటిన కారణజన్ముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల గుండె చప్పుడు అన్న నందమూరి తారక రామారావు అని అన్నారు

ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఆయన దివ్య స్మృతికి ఇవే మా ఘన నివాళులు అన్నారు. దేశ రాజ‌కీయాల్లో పెనుమార్పులు తీసుకువ‌చ్చిన ఘ‌న‌త ఎన్టీఆర్‌కే ద‌క్కుతుంద‌న్నారు. మ‌హిళ‌ల‌కు ఆస్తి హ‌క్కు విష‌యంలో కానీ…రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో కానీ…అనే మార్పులు తీసుకువ‌చ్చిన మ‌హానేత నంద‌మూరి తార‌క రామారావు అని చెప్పారు

ఆనాటి నుంచి ఈనాటి వ‌ర‌కు ఆయ‌న ఆశ‌య సాధ‌న‌కు కృషి చేస్తున్న‌వంటి నాయ‌కుడు నారా చంద్ర‌బాబునాయుడు అని పేర్కొన్నారు. జూన్ 4న నూత‌న ప్ర‌భుత్వం ఏర్పాటు కాబోతుంద‌న్నారు.

కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి మాట్లాడుతూ… భార‌త‌దేశంలోనే తొమ్మిది నెల‌ల్లో పార్టీ పెట్టి… ఇందిరాగాంధీనే  గ‌డ‌గ‌డ‌లాడించి అధికారంలోకి వ‌చ్చిన ఏకైక నాయ‌కుడు నంద‌మూరి తార‌క రామారావు అని కొనియాడారు

జూన్ 4న కాబోయే మంత్రి పొంగూరు నారాయ‌ణ ఆధ్వ‌ర్యంలో స్వ‌ర్గీయ ఎన్టీఆర్ జ‌యంతి వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రుపుకున్నామ‌న్నారు. ఎన్టీఆర్ ఒక దైవ‌సంభూతుడ‌న్నారు. నంద‌మూరి బాల‌కృష్ణ‌తో ఉన్న అనుబంధం మ‌రువ‌లేనిద‌న్నారు. నంద‌మూరి కుటుంబం ప్రేమ పొందాలంటే పూర్వ జ‌న్మ‌సుకృత‌మ‌న్నారు. ఆంధ్ర‌రాష్ట్రంలోనే… నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ భారీ మెజారిటీతో విజ‌యం సాధిస్తున్నార‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు

ఏడో దశ ఎన్నికలో ప్రచారంలో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి

ఇవాళ బెంగాల్‌లో ప్రధాని మోదీ పర్యటన ఏడో దశ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. ఇవాళ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పీఎం మోదీ పర్యటించనున్నారు ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాసత్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని అశోక్‌నగర్‌తో పాటు దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బరుయ్‌పూర్‌లో జాదవ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి కోసం ప్రధాని ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు. అలాగే, తొలిసారి కోల్‌కతాలో రోడ్ షో … Read more

అటు నటుడిగా ఇటు రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ రామారావు

Jr.NTR-Kalyan Ram: ఎన్టీఆర్ 101వ జయంతి నివాళులు అర్పించిన తారక్ కళ్యాణ్ రామ్.. అటు నటుడిగా.. ఇటు రాజకీయ నాయకుడిగా ప్రత్యేకత చాటుకున్న ఎన్టీఆర్ మరణించి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటికీ తెలుగువారి గుండెల్లో నిలిచే ఉన్నారు. ఎన్టీఆర్ జయంతి.. వర్దంతి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఆయన సేవలను గుర్తుచేసుకుంటారు అభిమానులు. గతేడాది తారక రామారావు శత జయంతి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఎంతో ఘనంగా నిర్వహించారు. మే 28న ఎన్టీఆర్ … Read more