తల్లికి వందనం పథకానికి తర్వలోనే విధివిధానాలు ప్రకటిస్తాం

తల్లికి వందనం పథకానికి తర్వలోనే విధివిధానాలు ప్రకటిస్తాం

ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ విద్యార్థికి రూ.15 వేలు ఇస్తాం

వైసీపీలా కోతలు లేకుండా పథకాన్ని అమలు చేస్తాం

ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు

అబద్ధాలకు, అసత్యాలకు అంతర్జాతీయ స్థాయిలో వైసీపీ పేటంట్ పొందింది

నెలరోజులు కాకుండానే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు

ఫించన్, ఇసుక, తల్లికి వందనం పథకాలపై విషప్రచారం చేస్తున్నారు

ఇద్దరు పిల్లలు ఉన్నా అమ్మఒడి ఇస్తామని మడమ తిప్పింది జగన్ కాదా?

తల్లికి వందనం గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.

తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం

తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం hr9newsin,

ఎపీలో మరో ఐదు కొత్త ఎయిర్ పోర్టులు

HR9NEWS T MAHESH

ఎపీలో మరో ఐదు కొత్త ఎయిర్ పోర్టులు రాబోతున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు

రాష్ట్రంలోని భోగాపురం ఎయిర్‌పోర్టుకు సమాంతరంగా మరో 5 నుంచి 6 ఎయిర్‌పోర్టులు వస్తాయని సీఎం తెలిపారు

భోగాపురం విమానాశ్రయంతోపాటు దొనకొండ, దగదర్తి, కుప్పం, నాగార్జునసాగర్‌ వద్ద విమానాశ్రయాలు నిర్మిస్తామని వెల్లడించారు.

అదే విధంగా కాకినాడ – అమలాపురం మధ్య మరో ఎయిర్పోర్టు రానున్నట్లు పేర్కొన్నారు.

ఒక్కో విమానాశ్రయం నిర్మాణానికి 800 నుంచి వెయ్యి ఎకరాల వరకు అవసరమవుతుందని అధికారులు చెప్పారని చంద్రబాబు తెలిపారు.

జాతీయ రహదారుల తరహాలో పీపీపీ మోడళ్లలో ఎయిర్‌పోర్టులు నిర్మించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

వయోబిల్టి గ్యాప్‌ ఫండింగ్‌ ప్రభుత్వం ఇస్తుందని హామీ ఇచ్చారు. మరోవైపు 2026 జూన్ నాటికి భోగాపురం పూర్తవుతుందని నిర్మాణ సంస్థల ప్రతినిధులు అంటున్నారని, తాను ఇంకా ముందే పూర్తి చేయమంటున్నానని సీఎం తెలిపారు.

2026 జూన్ 30న వచ్చి దీనిని ఆపరేషన్ చేయాలని, అందుకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు.

ఆర్ అండ్ బీ శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష

HR9NEWS T MAHESH

ఆర్ అండ్ బీ శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష..
రోడ్ల నిర్మాణం.. రోడ్ల దుస్థితిపై చర్చ.. రోడ్ల పరిస్థితిపై ఆరా..
దెబ్బతిన్న రోడ్లను బాగుచేసే ప్రక్రియ మొదలు పెట్టాలని ఆదేశాలు


CM Chandrababu: ఓవైపు క్షేత్రస్థాయిలో పర్యటనలు.. మరోవైపు.. వివిధ శాఖలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇక, ఈ రోజు ఆర్ అండ్ బీ శాఖపై సమీక్ష చేశారు.. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం.. రోడ్ల దుస్థితిపై ఈ సమావేశంలో చర్చించారు

రోడ్ల పరిస్థితిపై ఆరా తీశారు. వైఎస్‌ జగన్ ప్రభుత్వంలో కనీసం గుంతలు కూడా పూడ్చలేదని సీఎం చంద్రబాబుకు చెప్పారు అధికారులు. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదన్నారు

గత ప్రభుత్వ తీరుతో ఇప్పుడెవరూ ముందుకు రావడం లేదని సీఎంకు వివరించారు అధికారులు. గుంతలు పూడ్చేందుకు తక్షణం రూ.300 కోట్లు అవసరం అని సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఆర్ అండ్ బీ అధికారులు

అయితే, అత్యవసర పనులకు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు

సీఎం చంద్రబాబు గత ప్రభుత్వం రోడ్ల స్థితిగతులను పట్టించుకోలేదు అని మండిపడ్డ ఆయన.. వాహనదారులు, ప్రజలు ఐదేళ్ల పాటు నరకం చూశారు.

ఈ పరిస్థితిని మార్చేలా పనులు మొదలు కావాలని స్పష్టం చేశారు.. దెబ్బతిన్న రోడ్లను బాగుచేసే ప్రక్రియ మొదలు పెట్టాలి.. రాష్ట్రంలో 4,151 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతల సమస్య ఉంది.

తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు మరో 2,936 కిలోమీటర్లు మేర ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో 7,087 కిలోమీటర్ల పరిధిలో తక్షణం పనులు చేపట్టాలని ఆర్‌ అండ్‌ బీ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

కెటిఆర్ ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్

T MAHESH కెటిఆర్ ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ఏపీ రాజకీయాలపై స్పందిస్తూ జగన్ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినా ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు ప్రజలకు మంచి చేసిన వ్యక్తులు ఎంతోమంది ఓడిపోవడం విచిత్రమనిపించిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు వైసీపీ ఓటమి చెందినా 40 శాతం ఓట్లు రావడం సాధారణ విషయం కాదన్నారు. షర్మిలకు నాయకత్వ లక్షణాలు లేవన్నారు కేవలం జగన్‌ను ఓడించడానికి షర్మిలను పావులా వాడుకున్నారని తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమితో … Read more

శ్రీ వెంకయ్యనాయుడి నుంచి చాలా నేర్చుకున్నా ప్రధానమంత్రి

T MAHESH శ్రీ వెంకయ్యనాయుడి గారి నుంచి చాలా నేర్చుకున్నా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీయువత రాజకీయాల్లోకి రావాలి, సిద్ధాంతపరమైన రాజకీయాలను ప్రోత్సహించాలి  – శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు • వ్యక్తిత్వం, దార్శనికతల మేలు కలయికే వెంకయ్య గారు• దేశ ప్రయోజనాలే మిన్న అని నమ్మిన వ్యక్తి• ఆయన జీవితం నేటి  తరానికి స్ఫూర్తిదాయకమన్న ప్రధాని• భారత పూర్వ ఉపరాష్ర్టపతి 75వ పుట్టినరోజు సందర్భంగా, వారి జీవిత విశేషాలతో మూడు పుస్తకాల ఆవిష్కరణ భారత పూర్వ ఉపరాష్ర్టపతి … Read more

ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌గా ఉపేంద్ర ద్వివేది

ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌గా ఉపేంద్ర ద్వివేదిT MAHESH హైదరాబాద్:ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. 2022 మే నుంచి ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ మనోజ్ పాండే పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేశారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది దీనికి ముందు ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా ఉన్నారు. పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, మూడు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్‌ఛార్జ్‌ కమెండేషన్ … Read more