84 ఏళ్ల వయస్సులో 8th క్లాస్ పరీక్షలు
మధ్యప్రదేశ్‌లోని ఛింద్‌వాడాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ప్రకాశ్ ఇండియన్ టాటా 84 ఏళ్ల వయసులో 8వ తరగతి పరీక్షలు రాస్తున్నారు.
దీనిపై ఆయన స్పందిస్తూ చదువుకు వయసుకు సంబంధం లేదని తాను భావించానని, అందుకే మొదటగా మధ్యప్రదేశ్ ఓపెన్ బోర్డు నుంచి 5వ తరగతి పరీక్షలు రాశానన్నారు.
ఇప్పుడు 8వ తరగతి పరీక్షలు రాస్తున్నానని, ఇదే స్పూర్తితో పది, ఇంటర్ కూడా పూర్తి చేస్తానన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివి సత్తా చాటిన విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాలల్లో చదివి సత్తా చాటిన విద్యార్థులు మెట్టూరు, కొత్తూరు, కడుము, నివగాం పాఠశాలల నుండి ట్రిపుల్ ఐటీకి ఆరుగురు ఎంపిక కొత్తూరు : పాతపట్నం నియోజక వర్గంలో కొత్తూరు మండలంలోని మెట్టూరు, కొత్తూరు, నివగాంకడుము ప్రభుత్వ ఉన్నత, జిల్లాపరిషత్ పాఠశాల పదో తరగతి పరీక్షా ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన ఆరుగురు విద్యార్థినీ విద్యార్థులు ప్రభుత్వ ఐఐఐటి లకు ఎంపికైనట్లు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. కొత్తూరు మండలంలోని మెట్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల … Read more