ఏపీలో ఈసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా

ఏపీలో ఈసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా ?

వెస్ట్ గోదావరి :

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, ఉంగుటూరు, పోలవరం నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది

ఈ సెంటిమెంట్ గత 46ఏళ్లుగా వస్తోంది. అందుకే అందరి చూపు ఈ నాలుగు నియోజక వర్గాల పైనే ఉంది.

మరి ఈ ఎన్నికల్లో 46ఏళ్ల సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? లేక అంచనాలను తలకిందులు చేస్తూ సెంటిమెంట్ కు బ్రేక్ పడనుందా?  అనేది తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే

వెస్ట్ గోదావరి జిల్లాలో భారీ మెజార్టీతో టిడిపి గెలుస్తుందని అంచనాలు ఉన్నాయి

ధర్మవరం  మీదుగా రెండు ప్రత్యేక రైలు

ధర్మవరం మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు

వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ ధర్మవరం మీదుగా రెండు రైళ్లను నడుపుతోంది. యశ్వంతపూర్ నుంచి కాచిగూడ మీదుగా గయకు (06217/18) రైలు శనివారం వెళ్తుంది

మరో రైలు యశ్వంతపూర్ నుంచి విజయవాడ మీదుగా హౌరా(02864/63) మధ్య వారానికి ఒక రోజు నడుస్తుంది

రద్దీ దృష్ట్యా ఈ రెండు రైళ్లు ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి

వీటిని జూన్ తర్వాత కూడా కొనసాగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

దేశవాళీ తుపాకితో వేటకు వెళ్లిన ఇద్దరు అరెస్ట్ అన్నమయ్య జిల్లా మదనపల్లె

దేశవాళీ తుపాకితో వేటకు వెళ్లిన ఇద్దరు అరెస్ట్ అన్నమయ్య జిల్లా మదనపల్లె

దేశవ్యాలి తుపాకీతో వేటకు వెళ్లిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు మదనపల్లె రూరల్ సర్కిల్ సీఐ సద్గురుడు, నిమ్మనపల్లె ఎస్సై లోకేష్ రెడ్డి తెలిపారు

సోమవారం నిమ్మనపల్లె మండలంలోని నాగులయ్యగారిపల్లెకు చెందిన సేకోళ్ళ గిరి (23), గూడుపల్లెకు చెందిన గరివి వెంకటేష్ (25)లు గ్రామానికి సమీపంలోని రైతు బసప్ప వరి పొలాల వద్ద వేటాడు తుండగా దేశవాళి తుపాకీ స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు

పట్టుబడిన నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించి, వారిపై ఆమ్స్ యాక్ట్ కింద కేసు నమోదుచేసి అరెస్టు చేశామని ఎస్ఐ తెలిపారు

ఉచిత వేసవి బడి విద్యార్థులకు కరాటే శిక్షణా తరగతులు ప్రారంభం.

ఉచిత వేసవి బడి విద్యార్థులకు కరాటే శిక్షణా తరగతులు ప్రారంభం. మే నెలాఖరు వరకు అన్న దానం చేయడానికి దాత హామీ. హిందూపురం: ఆత్మ రక్షణకు కరాటే విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని కరాటే మాస్టర్ జనార్ధన రెడ్డి పేర్కొన్నారు.అందులో భాగంగా బాలికలకు కరాటే ఆత్మ గౌరవానికి, ప్రాణ రక్షణకు ఈ విద్య సంరక్షణకు సహాయ పడుతుందని తెలిపారు సోమవారం హిందూపురం పట్టణంలోని శాంతినగర్ ప్రక్కన వున్న త్యాగరాజ నగర్ లో గల మార్గదర్శి విద్యానికేతన్ పాఠశాల నిర్వాహకులు … Read more

పరిగి మండలంలో లూజ్ పెట్రోల్ అమ్మితే చర్యలు-ఎస్ఐ సత్యనారాయణ

పరిగి మండలం లో: లూజ్ పెట్రోల్ అమ్మితే చర్యలు : ఎస్ఐ సత్యనారాయణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా ఎలక్షన్ కమిషన్ లూస్ పెట్రోల్ 1 అమ్మకూడదని నిషేదాజ్ఞలు విధించింది. మాచర్ల తదితర ప్రాంతాల్లో పె ట్రోల్ – బాంబులను విసురుకుంటూ వీరంగం సృష్టించడం, అల్లర్లు సృష్టించడం, 1 ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం లాంటి స Oఘటనలు • జరిగినందున ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 4వ … Read more

ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కి నివాళులర్పించిన,కాంగ్రెస్ నాయకులు ఎం.హెచ్.ఇనాయ తుల్లా,నాయకులు కార్యకర్తలు

ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కి నివాళులర్పించిన,కాంగ్రెస్ నాయకులు ఎం.హెచ్.ఇనాయ తుల్లా, నాయకులు కార్యకర్తలు రాజీవ్ గాంధీ 1944 నాలుగులో జన్మించారు. ఈయన భారతదేశానికి ఆరో ప్రధానమంత్రిగా దేశానికి ఎంతో విశిష్ట సేవలు అందించారు. అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రిగా ఈయన భారతదేశానికి సేవలు అందించడం జరిగింది. శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు చేసిన మానవ బాంబు దాడిలో ఈయన మరణించడం జరిగింది. ఈయన మరణం ప్రపంచానికే తీరని లోటని ఏకంగా ఇప్పటికీ ఆయన … Read more

నందమూరి తారకరత్న భార్య అలేఖ్య ఓటు టిడిపికే..

దివంగత నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.ఏపీ ఎన్నికల్లో భాగంగా ఆమె సపోర్టు చేసే పార్టీ ఏదో తేల్చేశారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సందర్భంగా ఈ ఎన్నికల్లో అలేఖ్యా రెడ్డి సపోర్టు చేసే పార్టీ ఏదో ఇన్డైరెక్ట్గా వెల్లడించారు. కాగా తారకరత్న మరణాంతరం ఆయన బదులుగా అలేఖ్యా రెడ్డి ఎమ్మెల్యే పోటీ చేస్తారంటూ గతంలోకి వార్తలు వచ్చాయి. … Read more

జగనన్న స్పందించుకుంటే- వైయస్సార్ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపడతాం-: హిందుపురం బి బ్లాక్ కన్వీనర్ నరేష్

జగన్ కోసం ఊపందుకున్న సంతకాల ఉద్యమం-హిందూపురం నుండి జగన్ పోటీ చేయాలి- ప్రజల ఆశయాల కోసం జగన్ హిందూపురం నుండి పోటీ చేయాలి– లేదా హిందూపురం అభివృద్ధిపై మాట ఇవ్వాలి జగన్ స్పందించుకుంటే- వైయస్సార్ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపడతాం-: బి బ్లాక్ కన్వీనర్ నరేష్ గత 5సంవత్సరాలుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కులమత పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి అందరి మదిలో నిలిచారని అయితే స్థానిక అధికార … Read more

దిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టైన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తిహాడ్‌ జైల్లో ఓ చిన్న (14×8 అడుగుల విస్తీర్ణం) గదిలో విచారణ ఖైదీగా

దిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టైన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తిహాడ్‌ జైల్లో ఓ చిన్న (14×8 అడుగుల విస్తీర్ణం) గదిలో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. జైలు నంబర్‌ 2లో ఉన్న ఆయన.. ధ్యానం, యోగాతోపాటు పుస్తకాలు చదవుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రోజులో రెండుసార్లు ధ్యానం, యోగా చేస్తున్న కేజ్రీవాల్‌ ఎక్కువ సమయం పుస్తకాలతోనే గడపుతున్నట్లు తెలిపాయి. టీవీ ఉన్నప్పటికీ.. ఉదయం, సాయంత్రం గంటన్నరపాటు ఆయన యోగా, ధ్యానం చేస్తున్నారు. … Read more

ఆమెకు బెయిల్ ఇవ్వొద్దన్న ఈడీ- కొడుకు పరీక్షల నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలన్న కవిత తరపు న్యాయవాది

ఆమెకు బెయిల్ ఇవ్వొద్దన్న ఈడీ- కొడుకు పరీక్షల నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలన్న కవిత తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ పై విచారణ ముగించిన స్పెషల్ కోర్టు ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితే సూత్రధారి అని, అందుకే ఆమె బెయిల్ అప్లికేషన్ను వ్యతిరేకిస్తున్నామని ఈడీ తరపు న్యాయవాది జోహెబ్ హౌస్సేన్ కోర్టుకు తెలిపారు. అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు బెయిల్ ఇవ్వకూడదని వాదించారు. అయితే కొడుకు పరీక్షల నేపథ్యంలో కవితకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు … Read more