ప్రభుత్వ పాఠశాలల్లో చదివి సత్తా చాటిన విద్యార్థులు

ప్రభుత్వ పాఠశాలల్లో చదివి సత్తా చాటిన విద్యార్థులు

మెట్టూరు, కొత్తూరు, కడుము, నివగాం పాఠశాలల నుండి ట్రిపుల్ ఐటీకి ఆరుగురు ఎంపిక

కొత్తూరు :

పాతపట్నం నియోజక వర్గంలో కొత్తూరు మండలంలోని మెట్టూరు, కొత్తూరు, నివగాం
కడుము ప్రభుత్వ ఉన్నత,  జిల్లాపరిషత్ పాఠశాల పదో తరగతి పరీక్షా ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన ఆరుగురు విద్యార్థినీ విద్యార్థులు ప్రభుత్వ ఐఐఐటి లకు ఎంపికైనట్లు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తెలిపారు.

కొత్తూరు మండలంలోని మెట్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ముగ్గురు
విద్యార్థులు ఎంపికై ప్రధమస్థానంలో నిలవడం
విశేషం.

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మెట్టూరు జెడ్పిహెచ్ పాఠశాల అత్యున్నతఫలితాలు సాధించింది. ఇదే పాఠశాలకు
చెందిన బొల్ల సాయిచరణ్ ట్రిపుల్ ఐటి నూజివీడు, దిండిమ ప్రియదర్శిని,
యజ్ఞల జ్యోత్స్న లు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటి కు ఎంపిక కాగా, కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి బుయ్యాల నీలిమ అనే విద్యార్థిని శ్రీకాకుళం క్యాంపస్ కు ఎంపికైంది. వీరితో పాటు కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి కిల్లారి దీప్సికాశ్రీ నివగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన కౌముది రంజిత అనే విద్యార్థిని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటి క్యాంపస్ కు ఎన్నిక అయ్యారు.

తమ పాఠశాల నుండి ఈ యేడాది మొదటి విడత ట్రిపుల్ ట్రిపుల్ ఐటి మొదటి విడతలో ఒక్కొక్కరు ఐటిలో ముగ్గురు విద్యార్థులు ఎంపిక కావడం ఎంపిక కావడం పట్ల ఆయా పాఠశాల పట్ల మెట్టూరు జెడ్పిహెచ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.లక్ష్మి నరసింహం ఉపాధ్యాయులు, విద్యార్థులకు, వారి యొక్క
తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు.

అలాగే ఈ విద్యా సంవత్సరం లో కొత్తూరు మండలంలో కడుము, నివగాం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు
కె. తిరుమలరావు,ఎస్ నిర్మల  విద్యార్థిని, విద్యార్థులకు ఉపాధ్యాయ సిబ్బందికు
తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేసారు.

అలాగే కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ. గోవింద రావు ఎంపికైన విద్యార్థినికి, ఉపాద్యాయ బృందానికి, తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేసారు.

మొత్తంగా చూస్తే కొత్తూరు మండలంలో మొదటి విడత ట్రిపుల్ ఐటీ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు.

Leave a Comment