చంద్రబాబు నాయుడు గారిని భేటీ అయిన సామకోటి

ఉండవల్లి నివాసంలో చంద్రబాబు నాయుడు గారిని భేటీ అయిన సామకోటి
పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సామకోటిని అభినందించిన టిడిపి అధినేత
రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు వచ్చే విధంగా  చంద్రబాబు భరోసా


విజయవాడ ఉండవల్లి నివాసంలో  అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల కోసం పోరాడుతూ పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న స్వర్ణాంధ్ర సృష్టికర్త అమరావతి అభివృద్ధి ప్రదాత *తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని* ఉండవల్లి నివాసంలో సిబిఎన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి కలియుగ ప్రత్యక్ష దైవం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చిత్రపటాన్ని బహుకరించిన *శ్రీ సత్య సాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ.

అనంతరం ఈ సందర్భంగా స్థానికంగా మంగళవారం ఉండవల్లి నివాసంలో పత్రిక ముఖంగా వారు మాట్లాడుతూ… గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించి ఐదు రూపాయలకి పేద ప్రజలకు కడుపు నింపే అన్న క్యాంటీన్లను మూత వేయడం పై,మూతపడ్డ అన్నా క్యాంటీన్ ను ప్రారంభించి *అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో 21వ రోజు పునః ప్రారంభించి చంద్రన్న ఆశయం కోసం ప్రతి పేదవాని ఆకలి తీరుస్తున్నామని అనంతరం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లి అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాము.

అలాగే ‘‘రా కదలిరా’’తెలుగుదేశం పిలుస్తోంది రా* అనే కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రానికి మళ్లీ స్వర్ణయుగం రావాలంటే మళ్లీ చంద్రన్న రావాలని,రాతియుగం వైపు వెళ్తారా?.. స్వర్ణయుగం కోసం నాతో వస్తారా అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నామని అనేక సేవా కార్యక్రమాలతో ప్రజలకు చాలా దగ్గరయ్యామని చంద్రబాబు నాయుడు కి  తెలియజేశారు. నియోజకవర్గంలో పార్టీ విజయానికి అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు అందుకుగాను బాబు స్పందిస్తూ కష్ట కాలాలలో పార్టీ అభివృద్ధికి కష్టపడే వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని,మీరు చేస్తున్నట్టు కార్యక్రమాలు ప్రజల వద్దకు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మీకు తగిన గుర్తింపు వచ్చే విధంగా మేము భరోసాని కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించినట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment