


ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో అనంతపురంలో జరిగిన ‘న్యాయసాధన’ సభకు తరలివచ్చిన అశేష కార్యకర్తలకు, నాయకులకు, వైఎస్సార్ అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతున్నా అభివృద్ధిలో పట్టుమని పది అడుగులు కూడా ముందుకు పడలేదు. రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల విషయంలోనూ అటు టీడీపీ, ఇటు వైసీపీ.. రెండు పార్టీలు కేంద్రంలోని మోదీ సర్కార్కు సాగిలపడి వంగి మరి దండాలు పెట్టాయి తప్ప రాష్ట్ర శ్రేయస్సు కోసం మోదీని ఎదిరించలేదు.
రాష్ట్రానికి ఏం మేలు చేశారని చంద్రబాబు, జగనన్న ఇద్దరూ మోదీ జట్టు కోసం తాపత్రాయపడుతున్నారు. నాడు కాంగ్రెస్ హయాంలో రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పేదలకు అందించారు. అలాగే నేడు “ఇందిరమ్మ అభయం” గ్యారంటీ పేరుతో ప్రతి పేద ఇంటికి ప్రతి నెల ఒకటో తేదీనే 5వేల రూపాయలు.. ఏడాదికి 60వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇస్తున్నాం.
రాష్ట్రానికి మళ్లీ మేలు జరగలన్నా.. విభజన హామీలు సాధించుకోవాలన్నా.. అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ మద్దతుతో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి.. సంక్షేమాన్ని మీ గడపకే చేరుస్తామని మాట ఇస్తున్నాం.