కౌంటింగ్ విధులు ఎంతో బాధ్యతగా  నిర్వహించాలి

శ్రీ సత్యసాయి జిల్లా :

కౌంటింగ్ సందర్భంగా పటిష్ఠ భద్రత…

కౌంటింగ్ విధులు ఎంతో బాధ్యతగా  నిర్వహించాలి..
తమకు కేటాయించిన విధులలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా ఎస్పీ


హిందూపురంలోని బిట్స్ కళాశాలలో  సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలు ,పరిసర ప్రాంతాలలో విధులలో నిర్వహించనున్న పోలీస్ అధికారులు,సిబ్బందికి కౌంటింగ్ బందోబస్తు విధులపై   (బ్రీఫింగ్) దిశ నిర్దేశాలు చేసిన జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఐపీఎస్

కౌంటింగ్ సందర్భంగా ప్రతి పోలీస్ ఎంతో బాధ్యతగా విధులు నిర్వర్తించాలని,

కౌంటింగ్ సెంటర్ లోపలికి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేసి వారి వద్ద అనుమతి పాసులు ఉంటేనే పరిశీలించి లోపలికి పంపాలని,  .మొబైల్ ఫోన్స్,ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదని,
అభ్యర్థులకు  కేటాయించిన ప్రదేశాలలో వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చర్యలు చేపట్టాలన్నారు

ఏటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు జరగకుండా పకడ్బందీగా బందోబస్తు నిర్వహించాలన్నారు.  144సెక్షన్ అమలలో ఉనందన్న 4 కంటే ఎక్కువ మంది ఉండకుండా చూడాలన్నారు.  విజయోత్సవ ర్యాలీలు, సభలు,సమావేశాలు నిర్వహించడానికి అనుమతులు లేవు., కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా బందోబస్తు లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా,అప్రమత్తతో విధులు నిర్వర్తించి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగే విధంగా అందరూ బాగా సమిష్టితో పనిచేయాలని ఎస్పీ  సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్ విష్ణు  ,పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Comment