కౌంటింగు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాం
ప్రతీ ఒక్కరూ తప్పకుండా ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలి… ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు
జిల్లా ఎస్పీ గౌతమిసాలి IPS
అనంతపురంలో ఈరోజు కేంద్రసాయుధ బలగాలుచే నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ లో ముఖ్య అతిథిగా పాల్గొని ఎస్పీ ప్రసంగించారు
స్థానిక జెఎన్టీయులో జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించిన కౌంటింగు జూన్ నెల 4 వ తేదీన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే
జిల్లా యంత్రాంగంతో కలిసి కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా అన్నిరకాల బందోబస్తు చర్యలు చేపట్టాం
పోటీ అభ్యర్థులు, ఏజెంట్లు కౌంటింగు సిబ్బందితో సహకరించి ప్రక్రియ సాఫీగా జరిగేలా కృషి చేయాలి
కౌంటింగ్ జరిగే జెఎన్టీయు, పరిసరాలు స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్టమైన మూడంచెల భద్రత కొనసాగిస్తున్నాం ప్రత్యేక పార్టీలతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం
కౌంటింగ్ సెంటర్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎవరు గుంపులుగా గుమిగూడి ఉండరాదు. అదేవిధంగా 30 పోలీస్ యాక్ట అమల్లో ఉంది కావున అనుమతి లేకుండా ఎవరు ర్యాలీలు సభలు సమావేశాలు నిర్వహించరాదు
కౌంటింగు కేంద్రం చుట్టూ 3 కిలో మీటర్ల పరిధిలో రెడ్ జోన్ గా ప్రకటించామని… ఈ ఉత్తర్వులు ప్రకారం ఎవరూ డ్రోన్లు ఎగుర వేయరాదు
కౌంటింగ్ కేంద్రాల వద్ద జరిగే దృశ్యాలను కమాండ్ కంట్రోల్ నుండి పోలీసు అధికారులు ఎప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటారు.
ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనుమతి ఉన్న వారిని మాత్రమే కౌంటింగు కేంద్రాల్లోకి అనుమతిస్తాం…కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసేలా ఆదేశాలిచ్చాం
కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు వారి ఏజెంట్లు మాత్రమే వచ్చేలా చర్యలు తీసుకోవాలి.
కౌంటింగ్ కేంద్రానికి చుట్టుపక్కల ట్రాఫిక్ అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. సమీప కాలనీలు, గ్రామాల వారు సహకరించి సూచించిన ట్రాఫిక్ డైవర్షన్ ల ద్వారా గమ్యం చేరుకోవాలి
కౌంటింగు రోజున జిల్లా అంతటా హై అలెర్ట్
కౌంటింగ్ జరిగే జూన్ 4 వ తేదీన జిల్లా అంతటా హైఅలెర్ట్ ప్రకటించామని ఎస్పీ తెలిపారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. కౌంటింగు జరిగే జిల్లా కేంద్రంతో పాటు అన్ని మున్సిపల్ పట్టణాలు, మండల కేంద్రాల్లోని సమస్యాత్మక కాలనీలు, గ్రామాలలో ప్రత్యేక నిఘా వేశామన్నారు. రౌడీషీటర్లు, కిరాయి హంతకులు, ట్రబుల్ మాంగర్స్, హిస్టరీషీటర్ల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు

సాధారణ ఎన్నికల కౌంటింగు దృష్ట్యా జిల్లా అంతటా 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఈ ఉత్తర్వులు ప్రకారం నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడరాదన్నారు. అమలులో ఉన్న 30 పోలీసు యాక్టు ప్రకారం పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ర్యాలీలు నిర్వహించరాదని… విజయోత్సవ ర్యాలీలు చేపట్టరాదన్నారు. జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం బాణసంచా నిల్వ ఉంచడం, క్రయ విక్రయాలు చేయడం, కాల్చడం నిషేధమన్నారు
గెలుపోటములు సహజమని… ఓడిన వారి పట్ల కవ్వింపు చర్యలకు పాల్పడటం, హేళన చేయడం, రెచ్చగొట్టడం చేయరాదన్నారు. కౌంటింగు కేంద్రాల వద్దకు అనుమతించబడిన వ్యక్తుల మాత్రమే వెళ్లాలి. కౌంటింగు కేంద్రమైన జెఎన్టీయు పరిసరాలలోని హోటళ్లు, దుకాణాలు మూసివేయాలి. కౌంటింగు తర్వాత కూడా అన్ని వర్గాల ప్రజలు సంయమనం కోల్పోకుండా శాంతియుతంగా మెలగాలని విజ్ఞప్తి చేశారు
పోలింగ్ అనంతరం జిల్లాలో పోలీసులు తీసుకున్న చర్యలు
సమస్యలు సృష్టించే అనుమానమున్న/ వీలున్న 5,978 మందిని బౌండోవర్లు చేయించాం
ఎన్నికల రోజు అల్లర్లు, ఘర్షణలు మరియు అంతకు మునుపు వారిపై ఉన్న పాత కేసులను పరిగణలోకి తీసుకుని 332 రౌడీషీట్లు ఓపెన్ చేశాం
చట్టవ్యతిరేక శక్తులను హెచ్చరిస్తూ… ప్రజలకు భరోసానిస్తూ సమస్యాత్మక గ్రామాలు మరియు కాలనీలలో నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ లు 216
శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా… ముందస్తు చర్యలులో భాగంగా రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు, పాత కేసుల్లో నిందితుల ఇళ్లు, పరిసరాలలో నిర్వహించిన కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు 105
ప్రజలు కౌంటింగు ప్రక్రియకు సహకరించాలని… ప్రశాంతంగా జీవించాలని సూచించడంలో నిర్వహించిన గ్రామ సందర్శనలు 934
పోలింగు అనంతరం తలెత్తిన ఘర్షణలు, హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారిని అరెస్టు చేసిన సంఖ్య 292
కౌంటింగు వేళ సత్ప్రవర్తనతో జీవించాలని… ప్రశాంతంగా మెలగాలని సూచిస్తూ 1621 మంది రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్ , హిస్టరీ షీటర్ల కౌన్సెలింగ్
తాడిపత్రి, రాప్తాడు, అనంతపురం రూరల్, అనంతపురం సబ్ డివిజన్ల పరిధిల్లోని సమస్యాత్మక గ్రామాలు/ కాలనీలలో అల్లర్లు, ఘర్షణలు జరుగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలులో భాగంగా తాజా పరిస్థితులు తెలుసుకుని సమస్యలను మొగ్గ దశలోనే తుంచి వేయడానికి డ్రోన్ కెమేరాలతో నిఘా వేశాం
సమస్యాత్మక గ్రామాలు, కాలనీలలో పటిష్ట నిఘా కోసం నూతనంగా 250 సి.సి కెమేరాలు ఏర్పాటు చేశాం. వీటితో పాటు జిల్లా కేంద్రం మరియు ఇతర పట్టణాలలో 425 కెమేరాలు పని చేస్తున్నాయి
కౌంటింగ్ వేళ అపరిచితులు, అనుమానితులు లాడ్జిల్లో బస చేయకుండా… పందేలు కాయకుండా లాడ్జిల్లో తనిఖీలు ముమ్మరం చేశాం. మద్యం సేవించి గొడవలకు కారణమయ్యే అవకాశమున్న హోటళ్లలో కూడా క్షుణ్ణంగా చెకింగులు జరుగుతున్నాయి
జిల్లా అంతటా కౌంటింగు ముగిసే వరకు 144 సెక్షన్ ఉత్తర్వులను గట్టిగా అమలు చేస్తాం. నలుగురి కంటే ఎక్కువ ప్రజలు గుమిగూడకూడదు. ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
