కౌంటింగ్ సందర్భంగా  ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు

శ్రీ సత్యసాయి జిల్లా :

కౌంటింగ్ సందర్భంగా  ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.

జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు పూర్తి.

ట్రబుల్ మాంగర్లు పై ప్రత్యేక దృష్టి.


జిల్లా ఎస్పీ శ్రీ ఎస్పీ మాధవ్ రెడ్డి ఐపీఎస్

రాష్ట్ర గౌరవ డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్త ఐపీఎస్  రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించి ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లాలో అమలు అవుతున్న భద్రతా ఏర్పాట్ల గురించి సమీక్ష చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో  జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వి మాధవరెడ్డి ఐపీఎస్  హాజరయ్యారు.

గౌరవ డీజీపీ  ఆదేశాల మేరకు
వాటిని అమలుపరిచే విధంగా ఎస్పీ చర్యలు చేపట్టారు

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ కౌంటింగ్ రోజు గానీ, ఆ తర్వాత కూడా   జిల్లాలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళిక మేరకు పక్కాగా కఠిన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

సమస్యాత్మక గ్రామాలలో శాంతి భద్రతల పరిరక్షణ కొరకు సాయుధ పోలీసులతో పోలీసు పికెట్లను ఏర్పాటు చేసి, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు.

జిల్లాలో ఎక్కడ ఏమి జరిగినా ప్రత్యేక టీముల ద్వారా  నిమిషాలలో చేరుకునే విధంగా భద్రతా చర్యలు.

పోలింగ్ ప్రక్రియకు ఎవరైనా ఆటంకం కలిగించాలని ప్రయత్నిస్తే ఉపేక్షించం.  అలాంటి వారిపై  చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

హిందూపురం బిట్స్ కళాశాల లేపాక్షి వద్ద ఉన్న గురుకుల అంబేద్కర్ పాఠశాల
కౌంటింగ్ కేంద్రంల వద్ద  రెండు కిలోమీటర్ల పరిధి మేర రెడ్ జోన్ , గా ప్రకటిస్తూ ఉత్తర్వులు ఉన్నాయి. ఎవరైనా అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ వి మాధవ్ రెడ్డి ఐపీఎస్  హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్ పి ఎన్ విష్ణు  డీఎస్పీలు వాసుదేవన్, శ్రీనివాసులు, శ్రీలత, కంజక్షన్,కె ఎస్బి సిఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, ఎలక్షన్ సెల్ సీఐ విక్రమ్ , ఎస్సై ప్రదీప్ కుమార్,  పాల్గొన్నారు.

విధులలో అప్రమత్తంగా ఉండండి.. జిల్లా ఎస్పీ

కౌంటింగ్ మొదలుకొని పూర్తి అయిన తర్వాత కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది విధులలో అప్రమత్తంగా ఉండాలని     జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఐపీఎస్ సూచించారు


కౌంటింగ్ కోసం వివిధ జిల్లాల నుండి వచ్చిన సీఐ, ఎస్ఐల తో గురువారం రాత్రి కాన్ఫరెన్స్ హాల్లో కౌంటింగ్ విధులపై   జిల్లా ఎస్పీ గారు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ, మీకు కేటాయించిన ప్రాంతాలలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ  ట్రబుల్ మాంగర్లు ,  నేర ప్రవృత్తి కలిగిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని,
కౌంటింగ్ సెంటర్ల దగ్గర ఎట్టి పరిస్థితులను గొడవలు జరగకుండా చూడాలని,

గొడవలు జరిగే ప్రాంతాలలో వాటిని తెలుసుకొని పై అధికారులకు సమాచారం ఇవ్వాలని,
ఎవరైనా గొడవలు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తే అటువంటి వారిపై తీవ్రంగా పరిగణించాలని ,
కౌంటింగ్ పాసులు ఉంటేనే లోనికి అనుమతించాలని,
అభ్యర్థుల ఇళ్ల వద్ద ప్రత్యేక నిఘా పెట్టాలి,
కౌంటింగ్ సెంటర్ల లోపల ఏజెంట్లు ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే వారిని వెంటనే అదుపులో తీసుకోవాలన్నారు


కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత ఎక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంతంగా ఉండే విధంగా పోలీసులు అన్ని చర్యలు చేపట్టామని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్బి సిఐ బాలసుబ్రమణ్యం రెడ్డి, సైబర్ సెల్ సీఐ హేమంత్ కుమార్, ఎలక్షన్ సెల్ సిఐ విక్రమ్, ఎస్బి ఎస్ఐ ప్రదీప్ కుమార్ ఉన్నారు.

Leave a Comment