దేశ దర్మం కోసం బిజెపి మన బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ లను అమ్మేస్తున్నారు
అమ్మకానికి బీఎస్ఎన్ఎల్-ఎంటీఎన్ఎల్ ఆస్తులు
దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్కు ఆస్తులు.
వివిధ రాష్ర్టాల్లో 530కిపైగా భవనాలు, భూములున్నట్టు గుర్తించిన టెలికం శాఖ.
ఢిల్లీ, ముంబైల్లో మాత్రమే ఎంటీఎన్ఎల్కు ఆస్తులు. అయినప్పటికీ ప్రధాన ప్రాంతాల్లోనే చాలా ప్రాపర్టీలు.
ఢిల్లీలో 48, మహారాష్ట్రలో 52 ఆస్తులను కలిగి ఉన్న ఎంటీఎన్ఎల్.
దేశవ్యాప్తంగా 600లకుపైగా భూములు, భవనాలను గుర్తించిన కేంద్రం
ఆసక్తి ఉన్నవారి కోసం వెబ్సైట్ తెచ్చామన్న టెలికం శాఖ
దాదాపు రూ.25,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా
న్యూఢిల్లీ, మే 28: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), మహానగర్ టెలీఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్) ఆస్తులను పెద్ద ఎత్తున అమ్మేయాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు నిర్ణయించింది. ఈ క్రమంలోనే టెలికం శాఖ దేశవ్యాప్తంగా ఈ ఇరు ప్రభుత్వ రంగ టెలికం సంస్థలకున్న ఆస్తులను గుర్తించింది.
ఇందులో 600లకుపైగా భూములు, భవనాలున్నట్టు తేలింది. వీటన్నిటినీ కూడా వివిధ ప్రభుత్వ శాఖలకు, సర్కారీ సంస్థలకు, ప్రభుత్వ భాగస్వామ్యమున్న కంపెనీలకు పూర్తిగా అమ్మేయాలని చూస్తున్నారు. తద్వారా సుమారు రూ.25,000 కోట్ల ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నారు.
కాగా, బీఎస్ఎన్ఎల్కు చెందిన రూ.18,200 కోట్ల ఆస్తులను, ఎంటీఎన్ఎల్కు చెందిన రూ.5,158 కోట్ల విలువైన 6 ఆస్తులను అమ్మేందుకు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ అనుమతిచ్చినట్టు కమ్యూనికేషన్స్, ఐటీపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి గత ఏడాదే టెలికం శాఖ తెలియజేసింది.
పునరుద్ధరణ పేరుతో..
బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వీటి పునరుద్ధరణ పేరుతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సంస్థాగత ఆస్తులను పూర్తిగా అమ్మేయాలని చూస్తున్నది. నిజానికి 2019లోనే ఈ తంతుకు బీజం పడింది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పునరుద్ధరణ ప్రణాళికకు కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోదం తెలుపగా.. ఇందులో ఆయా సంస్థల మిగులు భూములు, భవనాల వంటి ఆస్తుల నగదీకరణ కూడా ఉన్నది.
‘బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లకు చెందిన ఆస్తులను అమ్మేస్తున్నాం. ఈ సమాచారాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఆస్తుల వివరాలను వెబ్సైట్లో పొందుపర్చాం. ఆసక్తిగలవారు చూడవచ్చు’ అని వివిధ మంత్రిత్వ శాఖల్లోని సంస్థలకు టెలికం శాఖ కార్యదర్శి మిట్టల్ లేఖ రాశారు.
ప్రభుత్వ తీరుపై విమర్మలు
బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ నష్టాలకు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలే కారణమన్న విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. సేవను మరిచి ఆదాయమే పరమావధిగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వాలు.. ప్రైవేట్ రంగ టెలికం సంస్థలకు స్పెక్ట్రం కేటాయింపుల్లో పెద్దపీట దక్కేలా చేశాయని మండిపడుతున్నారు
ప్రైవేట్ కంపెనీలు 5జీ, 6జీ అంటూ పరుగులు పెడుతుంటే.. ప్రభుత్వ టెలికం సంస్థలు మాత్రం 4జీ దగ్గరే పడిగాపులు కాస్తున్నాయని గుర్తుచేస్తున్నారు. రెండు సంస్థలనూ ఆదుకునేందుకు ప్యాకేజీలను ప్రకటించినా.. వాటి అమలులో మాత్రం చిత్తశుద్ధిని సర్కారీ పెద్దలు చూపడం లేదని ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు.
2019లో ఈ ఇరు సంస్థల పునరుద్ధరణకు కేంద్రం రూ.69,021 కోట్లతో ఓ ప్యాకేజీని తెచ్చిన సంగతి విదితమే. సంస్థాగత అప్పులు, నిర్వహణపరమైన నష్టాలను అధిగమించేందుకు ఈ నిధులను కేటాయించారు. ఇక 2022లో సుమారు రూ.1.64 లక్షల కోట్లతో మరో పునరుద్ధరణ ప్యాకేజీని మోదీ సర్కారు తీసుకొచ్చింది
అయినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. చివరకు ఆయా సంస్థల ఆస్తులను అమ్మి, వాటి రుణాలను తీరుస్తామని కేంద్రం చెప్తుండటం సర్వత్రా విస్మయానికి గురిచేస్తున్నది.