ఉచిత వేసవి బడి విద్యార్థులకు కరాటే శిక్షణా తరగతులు ప్రారంభం.
మే నెలాఖరు వరకు అన్న దానం చేయడానికి దాత హామీ.
హిందూపురం:
ఆత్మ రక్షణకు కరాటే విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని కరాటే మాస్టర్ జనార్ధన రెడ్డి పేర్కొన్నారు.అందులో భాగంగా బాలికలకు కరాటే ఆత్మ గౌరవానికి, ప్రాణ రక్షణకు ఈ విద్య సంరక్షణకు సహాయ పడుతుందని తెలిపారు
సోమవారం హిందూపురం పట్టణంలోని శాంతినగర్ ప్రక్కన వున్న త్యాగరాజ నగర్ లో గల మార్గదర్శి విద్యానికేతన్ పాఠశాల నిర్వాహకులు కె.సాయికళ, కె.మాళప్ప ఆధ్వర్యంలో కీర్తిశేషులు నాగశేషుడు జ్ఞాపకార్థం వై.కుళ్లాయమ్మ సౌజన్యంతో కొనసాగుతున్న ఇరవై ఆరవ యేడాది
ఉచిత వేసవి బడి విద్యార్ధులకు దాత సాప్ట్ వేర్ ఇంజనీర్ గోళ్ళాపురం బి.యన్.మంజునాథ్ సౌజన్యంతో అన్నదానం జరిగింది. అదే విధంగా విద్యార్ధి మైథ్లీ జన్మ దినం వేడుకలు కెక్ కటింగ్ జరుపుకొని మిఠాయిలు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలుపుకున్నారు
ఉచిత వేసవి బడి నిర్వాహకులు కె.సాయికళ – కె.మాళప్ప దంపతులు మాట్లాడుతూ విద్యార్థులకు సోమవారం నుండి కరాటే తరగతులు పట్టణంలో ఉన్న ప్రముఖ కరాటే మాస్టర్ జనార్ధన రెడ్డి సారథ్యంలో ప్రారంభం ఆయ్యాయని తెలిపారు
దాత మంజునాథ్ పొన్ సందేశంలో విద్య తరగని సంపద యని పేద పిల్లలు చదువులో ముందుండాలని ఆకాంక్షించారు.వేసవి బడి విద్యార్థులకు మే నెల ఆఖరి వరకు ప్రతి రోజు అన్న దానం చేస్తానని స్పష్టం చేశారు
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కె. మాళప్ప,సాయి అరవింద్, కంప్యూటర్ మాస్టర్ కోదండ, ఉపాధ్యాయులు బి. యస్. కుమారి,మమత, సిరి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.