శ్రీ సత్య సాయి జిల్లా,హిందూపురం పట్టణంలోని నంది సర్కిల్ సమీపంలో భర్త వేధింపుల కారణంతో సింధు(21) అనే వివాహిత ఫినాయిల్ సేవించి ఆత్మహత్యకు పాల్పడింది, ఈ సందర్భంగా బుధవారం ఉదయం తన స్వగృహములో సింధు అనే మహిళ బాత్రూం క్లీన్ చేసే ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తుంది, ఈ విషయం తెలుసుకున్న మృతురాలు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు హిందూపురం పట్టణానికి చేరుకొని మీ వల్లనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిందని కన్నీరు మున్నేరు తో విలపించారు.
గత మూడు సంవత్సరాల క్రితం అమడగూరు మండలం శీనుగానిపల్లికి చెందిన సుజాతమ్మ శివయ్య కుమార్తె సింధును హిందూపురం పట్టణానికి చెందిన బాలాజీ నిర్మలమ్మ కుమారుడు రేణుకరాజుతో హిందూ సాంప్రదాయపద్ధంగా వివాహం చేశారు, పెళ్లి సమయంలో 5 లక్షల రూపాయలు విలువ గల బంగారు, 50 వేల రూపాయలు నగదు కట్నం కింద ఇచ్చి పెళ్లి చేసినట్లు మృత్యురాలు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు, పెళ్లయిన సంవత్సరం సంసారం సజావుగా సాగిందని అనంతరం వివిధ రకాలుగా తన కుమార్తెను వేధిస్తుండేవారిని మృతురాల తల్లి సుజాతమ్మ ఆరోపించింది ,
భర్త రేణుక రాజు ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకొని, పిల్లల కాలేదని, ఎప్పుడు పడితే అప్పుడు పుట్టింటి నుండి డబ్బులు తీసుకురావాలని తమ కుమార్తెకు వేధిస్తుండేవాడని మృతురాలుతల్లి సుజాతమ్మ ఆరోపిస్తుంది
భర్త, అత్త ,మామ ,మరిది, ఆడబిడ్డ వేధింపుల కారణంతో తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తమకు న్యాయం చేయాలని టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు
పోలీసులు కేసు నమోదు చేసుకొని శవానికి పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.