బహుజన సమాజ్ పార్టీ హిందూపురం నియోజకవర్గం శాఖ ఆధ్వర్యంలో ఆబాద్ పేట లోని పార్టీ కార్యాలుపయంలో జరిగిన సమావేశంలో బిఎస్పి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీరాములు మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ రానున్న ఎన్నికలలో హిందూపురం పార్లమెంటుతోపాటు అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీలో ఉంటారని ఈ ఎన్నికలు లో బీఎస్పీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
రానున్న ఎన్నికలలో బహుజన సమాజ్ పార్టీ తరఫున హిందూపురం పార్లమెంట్ స్థానానికి ఎంపీ అభ్యర్థిగాకొల్లకుంట గ్రామానికి చెందిన బిసి సంఘం రాష్ట్ర నాయకులు,సినీ నిర్మాత నాగరాజు



నూతనంగా పార్టీలో చేరిన కొల్లకుంట గ్రామానికి చెందిన బిసి సంఘం రాష్ట్ర నాయకులు,సినీ నిర్మాత నాగరాజు గారు పార్టీ కార్యాలయం కి వచ్చి నాయకులు కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించి రానున్న ఎన్నికలలో బహుజన సమాజ్ పార్టీ తరఫున హిందూపురం పార్లమెంట్ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా నన్ను రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పరంజ్యోతి గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రిటైర్డ్ ఐపిఎస్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సూచన మేరకు శ్రీ పరంజ్యోతి గారు ఎంపీ అభ్యర్థిగా నన్ను నియమించినందుకు ప్రవీణ్ కుమార్ గారికి మరియు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పరంజ్యోతి గారికి రాష్ట్ర నాయకులు శ్రీ శ్రీరాములు గారికి మరి హిందూపూర్ నియోజకవర్గ నాయకులు అందరికీ కూడా పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసి పార్లమెంట్ ఎన్నికలలో నన్ను గెలిపించడానికి మీరందరూ కృషి చేయాలని కోరడమైనది.
ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి హరికుమార్, నియోజకవర్గ అధ్యక్షులు నాజీమ్ భాష, పట్టణ అధ్యక్షులు దాసరి ఈశ్వరయ్య, సీనియర్ నాయకులు అడ్వకేట్ సత్యనందమూర్తి, నాయకులు ఎమ్మెల్ నారాయణ, సీనియర్ బిఎస్పీ నాయకులు రిటైర్డ్ ఎంఈఓ పెన్నయ్య, క్రిష్టప్ప, మౌలాలి, చిరంజీవి, నరసింహులు, తిరుమలేష్, గంగాధరప్ప,అంజినప్ప, బాబు, హుస్సేన్,బాలం గంగాధర్,చంద్రశేఖర్,శంషాద్, రవికుమార్,నాగరాజు, బండారు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు