84 ఏళ్ల వయస్సులో 8th క్లాస్ పరీక్షలు
మధ్యప్రదేశ్లోని ఛింద్వాడాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ప్రకాశ్ ఇండియన్ టాటా 84 ఏళ్ల వయసులో 8వ తరగతి పరీక్షలు రాస్తున్నారు.
దీనిపై ఆయన స్పందిస్తూ చదువుకు వయసుకు సంబంధం లేదని తాను భావించానని, అందుకే మొదటగా మధ్యప్రదేశ్ ఓపెన్ బోర్డు నుంచి 5వ తరగతి పరీక్షలు రాశానన్నారు.
ఇప్పుడు 8వ తరగతి పరీక్షలు రాస్తున్నానని, ఇదే స్పూర్తితో పది, ఇంటర్ కూడా పూర్తి చేస్తానన్నారు.
