84 ఏళ్ల వయస్సులో 8th క్లాస్ పరీక్షలు
మధ్యప్రదేశ్‌లోని ఛింద్‌వాడాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ప్రకాశ్ ఇండియన్ టాటా 84 ఏళ్ల వయసులో 8వ తరగతి పరీక్షలు రాస్తున్నారు.
దీనిపై ఆయన స్పందిస్తూ చదువుకు వయసుకు సంబంధం లేదని తాను భావించానని, అందుకే మొదటగా మధ్యప్రదేశ్ ఓపెన్ బోర్డు నుంచి 5వ తరగతి పరీక్షలు రాశానన్నారు.
ఇప్పుడు 8వ తరగతి పరీక్షలు రాస్తున్నానని, ఇదే స్పూర్తితో పది, ఇంటర్ కూడా పూర్తి చేస్తానన్నారు.
Month: May 2024
సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్
విజయవాడ:
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడి సతీష్ బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్..
నిందితుడు సతీష్ పిటిషన్పై విజయవాడలోని 8వ అదనపు జిల్లా కోర్టులో వాదనలు..
సతీష్ కుమార్ తరపున కోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాది సలీం..
సతీష్ కుమార్ను పోలీసులు అక్రమంగా ఈ కేసులో ఇరికించారన్న సలీం..
సతీష్ బెయిల్ పిటిషన్పై రేపు ఆర్డర్స్ ఇవ్వనున్న న్యాయమూర్తి..
ఏపీలో ఫలితాలపైనే ఉత్కంఠ నెలకొంది
ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి జరిగిన భారీ పోలింగ్ నేపథ్యంలో ఫలితాలపైనా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా గతంతో పోలిస్తే పెరిగిన పోలింగ్ శాతం, రాష్ట్రం బయట ఉన్న వారు భారీగా వచ్చి పోలింగ్ లో పాల్గొనడం
వైసీపీ, కూటమికి మధ్య జరిగిన హోరాహోరీ పోరు నేపథ్యంలో ఫలితాలపై ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఇవాళ ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈసారి ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలు 8 వేల కోట్లు, 6 వేల కోట్ల చొప్పున ఖర్చు పెట్టాయని రఘువీరారెడ్డి వెల్లడించారు. వారితో పోటీ పడి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లలో గెలిచే పరిస్ధితి లేదన్నారు
కాంగ్రెస్ ఈసారి డబ్బు ప్రభావం పనిచేయని రెండు, మూడు సీట్లలో గెలిచే అవకాశం ఉందన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎంపీ సీట్లలో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు భావిస్తున్నట్లు రఘువీరా తెలిపారు.
అలాగే ఈసారి ఎన్నికల్లో ఎవరికీ గాలి లేదని రఘువీరా తెలిపారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 2009 రిపీట్ అవుతుందేమో అనిపిస్తోందన్నారు
అప్పటి ఎన్నికల్లోనూ తమకు నామమాత్రపు సీట్లతో మెజార్టీ వచ్చిందన్నారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు
అయితే ఏ పార్టీ ఇలా బయటపడుతుందో మాత్రం ఆయన చెప్పలేదు.గెలిచే వారికి మాత్రం 95-97 సీట్లే వస్తాయన్నారు. అలాగే 100 మంది ఎమ్మెల్యేలకు మెజార్టీ 10 వేల లోపే ఉంటుందన్నారు. కచ్చితంగా ఇది క్లోజ్ ఫైట్ అన్నారు.
మహా విషాదం 2000 దాటిన మరణాలు
మహా విషాదం.. 2వేలు దాటిన మరణాలు
పపువా న్యూగినియా:
ఇండోనేషియాకు సమీపంలో ఉండే పపువా న్యూగినియాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరణాల సంఖ్య 2వేలు దాటింది.
శుక్రవారం తెల్లవారుజామున భారీగా కొండచరియలు విరిగి పడ్డాయి.
ఈ ఘటనలో మరణాలు 2 వేలు దాటినట్లు ఆ దేశం ఐక్యరాజ్య సమితికి నివేదిక సమర్పించింది.
భారీగా నష్టం వాటిల్లిందని, ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు సహాయక చర్యలు
కొనసాగుతున్నాయి.కొండలను ఆనుకొని గ్రామాలు ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉంది.
ఆర్టీవో ఆఫీస్ నుండి జారీ చేయాలి సిఐటియు
డ్రైవింగ్ లైసెన్సులను ప్రభుత్వం ద్వారానే ఆర్టీవో ఆఫీస్ నుండి జారీ చేయాలి . ట్రాన్స్ పోర్టు జిల్లా ప్రధాన కార్యదర్శి పెడబల్లి బాబా పెనుకొండ పట్టణం సిఐటియు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి ఈ సందర్భంగా ట్రాన్స్ ఫోర్ట్ రంగం జిల్లా ప్రధాన కార్యదర్శి పెడపల్లి బాబా మాట్లాడుతూ
జూన్ 1 నుండి ప్రైవేట్ సంస్థల ద్వారా డ్రైవింగ్ లైసెన్సులను ఇవ్వాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలను ప్రవేశపరం చేయాలనే నిజములో భాగంగా ట్రాన్స్పోర్ట్ రంగానికి గుండెకాయగా ఉండే
ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తూ ప్రజల భద్రత రిత్యా డ్రైవింగ్ లైసెన్స్ ను జారీ చేసే సందర్భంలో అనేక కొలమానాలతో ఎ డ్యూ కేట్ చేసే విధానాన్ని తుంగలో తొక్కి ప్రైవేట్ సంస్థలకు డ్రైవింగ్ లైసెన్సులను ఇచ్చే అనుమతి (2024 జూన్ 1 నుండి) నిర్ణయాన్ని సిఐటియు
జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ
ప్రజల భద్రతకు ప్రాణాలకు సంబంధం కలిగి ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ లోనూ డబ్బే కొలమానంగా బాధ్యత రహితంగా ఉండే ప్రైవేట్ సంస్థలకు డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేసే అవకాశాన్ని కల్పించడం అంటే ప్రజల భద్రతకు ప్రాణాలకు కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ నిర్ణయం ద్వారా తెలుస్తుంది
అదేవిధంగా ఆర్టీవో ఆఫీస్ నిర్వహణలో కీలకమైన డ్రైవింగ్ లైసెన్సుల మంజూరు ప్రభుత్వానికి పెద్ద ఆదాయ వనరుగా ఉంది డ్రైవింగ్ లైసెన్సులను ఆర్టీవో ఆఫీసుల నుండి తొలగిస్తే ఆర్టీవో ఆఫీసులో నష్టాల్లోకి వెళ్తుంది. తద్వారా పూర్తిగా ప్రస్తుత ట్రాన్స్ పోర్ట్ రంగం సర్వీసులను ప్రైవేటుపరం చేయాలని దుర్మార్గ ఆలోచన ప్రభుత్వం చేస్తుంది
తద్వారా ప్రజల పైన టాక్స్ ల రూపంలో బారాలు పడతాయి కావున ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం
లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్టీవో కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా తెలియజేశారు
ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బాబావలి, మా భాష, ఆటో యూనియన్ నాయకులు తిప్పన్నా, నాగప్ప, షరీఫ్, రాజగోపాల్, రంగప్ప తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ వజ్రకూరు మండలం వజ్రాల వేట
అనంతపురం జిల్లా ఉరవకొండ వజ్రకరూరు మండలం వజ్రాలు వేట
వజ్రాలు దొరుకుతున్నాయోచ్.. చిన్న రాయి దొరికినా చాలు లైఫ్ సెటిలయిపోయినట్లే.. ఎక్కడంటే
రాయలసీమ రతనాల సీమ..అంటారు.. ఇప్పుడు నిజంగా రతనాల సీమ మాదిరిగానే మారింది
సాధారణంగా మట్టిలో రాళ్లు రప్పలు కనిపిస్తుంటాయి.. కానీ.. ఇక్కడ మాత్రం వజ్రాలు కనిపిస్తుంటాయి.. అదికూడా వర్షా కాలంలో మాత్రమే
సాధారణంగా వర్షం పడితే మట్టి వాసన రావడం సహజం.. కానీ రాయలసీమలో మాత్రం నాలుగు చినుకులు పడితే చాలు మట్టి నుంచి వజ్రాలు బయటపడతాయి
వేప చెట్లకు మామిడికాయలు
వేపచెట్టుకు మామిడికాయలు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఓ వింత దృశ్యం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది రాష్ట్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ నివాసంలోని వేపచెట్టుకు మామిడి కాయలు కాసిన వీడియో వైరల్గా మారింది ఈ వీడియోను ఆయనే Xలో పోస్ట్ చేశారు. దీనిని చూసి ఆశ్చర్య పోయినట్లు ప్రహ్లాద్ పేర్కొన్నారు కాగా వేప కొమ్మపై మామిడి పూత పడటంతోనే ఇలా జరిగి ఉంటుందని వృక్ష శాస్త్రజ్ఞులు తెలిపారు
రైతుకి పొలంలో దొరికిన విలువైన వజ్రాల వేటలో రైతు సక్సెస్ అయ్యారు
కర్నూలు: రైతుకి పొలంలో దొరికిన విలువైన వజ్రం
కర్నూలు జిల్లాలో వజ్రాల వేటలో రైతు సక్సెస్ అయ్యారు.. పొలం పనులు చేస్తున్న సమయంలో ఆయనకు ఓ వజ్రం దొరికింది
వెంటనే వ్యాపారులు వేలంపాట నిర్వహించగా భారీ ధరకు ఓ వ్యాపారి దక్కించుకున్నారు. డబ్బులు, బంగారాన్ని ఆ రైతుకు చెల్లించి వజ్రాన్ని వ్యాపారి దక్కించుకున్నారు
కర్నూలు జిల్లా ఒక్కటే మాత్రమే కాదు అటు అనంతపురం జిల్లాలోని పొలాలు, స్థలాల్లో కూడా ఈ వజ్రాల వేట కొనసాగుతోంది.కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కొనసాగుతోంది
గత వారం రోజులుగా జనాలు పొలాల్లో వజ్రాల కోసం గాలిస్తున్నారు.. ఈ క్రమంలో ఓ రైతును అదృష్టం వరించింది. పొలంలో పనులు చేస్తుండగా ఓ వజ్రం దొరికింది
జీవితమే మారిపోయింది. కర్నూలు జిల్లా మద్దెకర మండలం హంప గ్రామంలో ఓ రైతు పొలం పనులు చేసుకుంటున్నాడు. అతడికి పొలంలో ఓ వజ్రం దొరకగా
పెరవలికి చెందిన వ్యాపారి వేలం పాటలో రూ.5 లక్షలు, రెండు గ్రాముల బంగారం రైతుకు ఇచ్చి ఆ వజ్రాన్ని దక్కించుకున్నాడు
అయితే బయట మార్కెట్‌లో ఆ వజ్రం విలువ ఇంకా ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
కేవలం ఒకే ఒక్క నిమిషంలోనే ఫోన్ చార్జింగ్
ఒక్క నిమిషంలోనే ఫోన్ చార్జింగ్
ఈ కొత్త సాంకేతికతను ఈ టెక్నాలజీ ద్వారా లాప్టాప్ మొబైల్ ఫోన్లకు ఒక నిమిషంలోనే చార్జింగ్
కేవలం ఒకే ఒక్క నిమిషంలో ఫోన్‌కు 0 నుంచి 100 శాతం వరకు చార్జ్ చేయగలిగే
కొత్త సాంకేతికతను కొలరాడో యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అంకుర్ గుప్తా అభివృద్ధి చేశారు.
ఈ టెక్నాలజీ ద్వారా ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లకు ఒక్క నిమిషంలో,
ఎలక్ట్రిక్ కారుకు 10 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్ చేయొచ్చని తెలిపారు.
విద్యుత్ గ్రిడ్లలో వేగంగా విద్యుత్తును నిల్వ చేయడానికి కూడా ఈ సాంకేతికత ఉపయోగపడుతుందన్నారు.
ఏపీలో ఈసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా
ఏపీలో ఈసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా ?
వెస్ట్ గోదావరి :
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, ఉంగుటూరు, పోలవరం నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది
ఈ సెంటిమెంట్ గత 46ఏళ్లుగా వస్తోంది. అందుకే అందరి చూపు ఈ నాలుగు నియోజక వర్గాల పైనే ఉంది.
మరి ఈ ఎన్నికల్లో 46ఏళ్ల సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? లేక అంచనాలను తలకిందులు చేస్తూ సెంటిమెంట్ కు బ్రేక్ పడనుందా? అనేది తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే
వెస్ట్ గోదావరి జిల్లాలో భారీ మెజార్టీతో టిడిపి గెలుస్తుందని అంచనాలు ఉన్నాయి
