యుగ‌పురుషుడు ఎన్టీఆర్‌

యుగ‌పురుషుడు ఎన్టీఆర్‌  101 ఎన్టీఆర్ జ‌యంతి వేడుకలు
టీడీపీ కార్యాల‌యం, మాజీ మంత్రి నారాయ‌ణ క్యాంప్ కార్యాల‌యంలో సంబ‌రాలు
స్వ‌ర్గీయ ఎన్టీ రామారావు విగ్ర‌హానికి ఘ‌న నివాళులర్పించిన‌ టీడీపీ నేత‌లు
కేక్ క‌ట్ చేసి ఒక‌రికొక‌రు తినిపించుకున్న నాయ‌కులు
జై ఎన్టీఆర్‌…జై ఎన్టీఆర్ అంటూ హోరెత్తిన నినాదాలు

నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాల‌యంతోపాటు… గోమ‌తి న‌గ‌ర్‌లోని మాజీ మంత్రి నారాయ‌ణ క్యాంప్ కార్యాల‌యంలో

పార్టీ జిల్లా అధ్య‌క్షుడు షేక్ అబ్ధుల్ అజీజ్ ఆధ్వ‌ర్యంలో తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి, స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు 101వ‌ జ‌యంతి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు

ఈ కార్య‌క్ర‌మంలో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీద ర‌విచంద్ర‌, మాజీ మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌, తాళ్ల‌పాక ర‌మేష్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి, మాజీ మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ తాళ్ల‌పాక అనూరాధ‌, న‌గ‌రాధ్య‌క్షుడు మామిడాల మ‌ధు, మాలేపాటి సుబ్బానాయుడు, కంభం విజ‌య‌రామిరెడ్డి, వేమిరెడ్డి విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి టీడీపీ ముఖ్య నేత‌లు పాల్గొన్నారు

ముందుగా ఎన్టీఆర్ కాంస్య విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి ఘ‌న నివాళుల‌ర్పించారు.  ఎన్టీఆర్ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని కేక్ ను క‌ట్ చేసి ఒక‌రికొక‌రు తినిపించుకున్నారు. జిందాబాద్‌ తెలుగుదేశం…జై ఎన్టీఆర్…సాధిస్తాం…సాధిస్తాం ఎన్టీఆర్ ఆశ‌యాల‌ను  అంటూ నినాదాలు హోరెత్తించారు.

అనంత‌రం డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ మీడియాతో మాట్లాడుతూ… నంద‌మూరి తార‌క రామారావు 101వ జ‌యంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘ‌నంగా జ‌రుపుకుంటున్నార‌న్నారు

ఎల‌క్ష‌న్ కోడ్ ఉండ‌డం వ‌ల్ల‌… జ‌యంతి కార్య‌క్ర‌మాల‌ను పార్టీ కార్యాల‌యాల్లోనే నిర్వ‌హించుకుంటున్నామ‌ని తెలిపారు. సినీ రంగంలోనే రాకుండా…రాజ‌కీయ రంగంలోనూ అనేక విప్ల‌వాత్మక మార్పులు ఏకైక నాయ‌కుడు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ అని కొనియాడారు

అదే విధంగా పేద బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల కోసం ఎంతో సేవ చేశార‌న్నారు. భూమి మీద ఉన్న ప్ర‌తీ ఒక్క‌రికి కూడు, గుడ్డ‌, నీడ ఉండాల‌న్న‌దే ఆయ‌న ఆశ‌య‌మ‌న్నారు. ప్ర‌తీ పేద‌వాడికి సొంత ఇల్లు ఉండాల‌నే కార్య‌క్ర‌మాల‌ను ఆయ‌న తీసుకువ‌చ్చార‌ని గుర్తు చేశారు

ఆ కార్య‌క్ర‌మాల‌ను భార‌త దేశంలోని అన్నీ రాష్ట్రాల్లో అమ‌ల‌వుతున్నాయ‌న్నారు. అదే విధంగా విద్యార్థుల చ‌దువుల కోసం రెసిడెన్షియ‌ల్ కాలేజీల‌ను ప్రారంభించింది…లోక‌ల్ బాడీ ఎల‌క్ష‌న్‌లో రిజ‌ర్వేష‌న్ వంటి వాటిని తీసుకువ‌చ్చింది  ఎన్టీ రామారావు అని పేర్కొన్నారు

ఇలా ఆయ‌న అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చార‌ని… వాట‌న్నింటిని గ‌త 14 ఏళ్లుగా  మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు అమ‌లు చేస్తున్నార‌న్నారు. తెలుగువారి ఆత్మ గౌర‌వాన్ని ప్ర‌పంచ‌మంతా చాటి చెప్పిన‌  గొప్ప వ్య‌క్తి అని అన్నారు. ఆయ‌న యుగ‌పురుషుడ‌ని అన్నారు. ప్ర‌జాస్వామ్యాన్ని కూడా తీసుకువ‌చ్చింది ఎన్టీఆరేన‌న్నారు.

తాళ్ల‌పాక ర‌మేష్‌రెడ్డి మాట్లాడుతూ… మా దైవం స్వ‌ర్గీయ ఎన్టీఆర్ జ‌యంతిని ఘ‌నంగా జ‌రుపుకొని ఆయ‌న‌కి  నివాళుల‌ర్పించ‌డం జ‌రిగింద‌న్నారు. ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని…ఆయ‌న స్థాపించిన క‌ల‌క‌లం వ‌ర్ధిల్లాల‌ని ఆకాంక్షించారు. జూన్ 4న విడుద‌ల‌య్యే ఫ‌లితాల్లో అన్న ఆశీస్సుల‌తో తెలుగుదేశం పార్టీ ఘ‌న విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని ర‌మేష్‌రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు

పేద‌ల‌ను ఆదుకున్న ఏకైక నాయ‌కుడు ఎన్టీ రామారావు అని తెలిపారు. అదే కోవ‌లో చంద్ర‌బాబునాయుడు ప‌ని చేసి తెలుగుదేశం పార్టీకి ఉజ్వ‌ల భ‌విష్య‌త్ తీసుకువ‌స్తార‌న్నారు.

అబ్ధుల్ అజీజ్ మాట్లాడుతూ….శ‌తాబ్ధి జ‌యంతుల‌ను జ‌రుపుకుంటున్నామంటే వారు మ‌హానుభావులు అని…కార‌జ‌న్ముల‌ని… ఆయ‌నే నంద‌మూరి తార‌క రామారావు అని చెప్పారు. తెలుగుజాతి ఉన్న‌న్ని సంవ‌త్స‌రాలు…రాబోయే త‌రాల వారు కూడా ఎన్టీఆర్‌ని గుర్తు పెట్టుకుంటార‌న్నారు

తెలుగుజాతికే గౌర‌వం తెచ్చిన వ్య‌క్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. సినీ రంగంలోనే హీరో కాద‌ని…ఆయ‌న నిజ జీవితంలోనూ హీరో అని కొనియాడారు. మ‌ళ్లీ ఎన్టీఆర్ ఆశ‌యాల‌ను పూర్తి చేసే ప్ర‌భుత్వం…తెలుగుదేశం ప్ర‌భుత్వం అని…అది కాబోయే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ద్వారా జ‌ర‌గ‌బోతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

బీద ర‌విచంద్ర మాట్లాడుతూ… తెలుగుజాతి కీర్తి ప్రతిష్టలను ప్రపంచ నలుదిశలా ఎలుగెత్తి చాటిన కారణజన్ముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల గుండె చప్పుడు అన్న నందమూరి తారక రామారావు అని అన్నారు

ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఆయన దివ్య స్మృతికి ఇవే మా ఘన నివాళులు అన్నారు. దేశ రాజ‌కీయాల్లో పెనుమార్పులు తీసుకువ‌చ్చిన ఘ‌న‌త ఎన్టీఆర్‌కే ద‌క్కుతుంద‌న్నారు. మ‌హిళ‌ల‌కు ఆస్తి హ‌క్కు విష‌యంలో కానీ…రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో కానీ…అనే మార్పులు తీసుకువ‌చ్చిన మ‌హానేత నంద‌మూరి తార‌క రామారావు అని చెప్పారు

ఆనాటి నుంచి ఈనాటి వ‌ర‌కు ఆయ‌న ఆశ‌య సాధ‌న‌కు కృషి చేస్తున్న‌వంటి నాయ‌కుడు నారా చంద్ర‌బాబునాయుడు అని పేర్కొన్నారు. జూన్ 4న నూత‌న ప్ర‌భుత్వం ఏర్పాటు కాబోతుంద‌న్నారు.

కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి మాట్లాడుతూ… భార‌త‌దేశంలోనే తొమ్మిది నెల‌ల్లో పార్టీ పెట్టి… ఇందిరాగాంధీనే  గ‌డ‌గ‌డ‌లాడించి అధికారంలోకి వ‌చ్చిన ఏకైక నాయ‌కుడు నంద‌మూరి తార‌క రామారావు అని కొనియాడారు

జూన్ 4న కాబోయే మంత్రి పొంగూరు నారాయ‌ణ ఆధ్వ‌ర్యంలో స్వ‌ర్గీయ ఎన్టీఆర్ జ‌యంతి వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రుపుకున్నామ‌న్నారు. ఎన్టీఆర్ ఒక దైవ‌సంభూతుడ‌న్నారు. నంద‌మూరి బాల‌కృష్ణ‌తో ఉన్న అనుబంధం మ‌రువ‌లేనిద‌న్నారు. నంద‌మూరి కుటుంబం ప్రేమ పొందాలంటే పూర్వ జ‌న్మ‌సుకృత‌మ‌న్నారు. ఆంధ్ర‌రాష్ట్రంలోనే… నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ భారీ మెజారిటీతో విజ‌యం సాధిస్తున్నార‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు

టీ20 ప్రపంచ కప్ భారత్ మ్యాచ్ లు ఎప్పుడంటే

టీ20 ప్రపంచ కప్.. భారత్ మ్యాచ్ లు ఎప్పుడంటే టీ20 ప్రపంచ కప్.. భారత్ మ్యాచ్ లు ఎప్పుడంటేT20 ప్రపంచ కప్ కు సమయం దగ్గర పడుతోంది ఈ టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం జూన్ 5న న్యూయార్క్ లో ఐర్లాండ్ తో టీంఇండియా తలపడనుంది ఆ తర్వాత న్యూయార్క్ లోనే జూన్ 9న పాకిస్థాన్ తో, జూన్ 12న అమెరికాతో పోటీపడనుంది. భారత్ తన ఆఖరి గ్రూప్ మ్యాచ్ ను జూన్ 15న కెనడాతో ఆడుతుంది ఈ … Read more

ఏడో దశ ఎన్నికలో ప్రచారంలో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి

ఇవాళ బెంగాల్‌లో ప్రధాని మోదీ పర్యటన ఏడో దశ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. ఇవాళ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పీఎం మోదీ పర్యటించనున్నారు ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాసత్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని అశోక్‌నగర్‌తో పాటు దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బరుయ్‌పూర్‌లో జాదవ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి కోసం ప్రధాని ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు. అలాగే, తొలిసారి కోల్‌కతాలో రోడ్ షో … Read more

అటు నటుడిగా ఇటు రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ రామారావు

Jr.NTR-Kalyan Ram: ఎన్టీఆర్ 101వ జయంతి నివాళులు అర్పించిన తారక్ కళ్యాణ్ రామ్.. అటు నటుడిగా.. ఇటు రాజకీయ నాయకుడిగా ప్రత్యేకత చాటుకున్న ఎన్టీఆర్ మరణించి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటికీ తెలుగువారి గుండెల్లో నిలిచే ఉన్నారు. ఎన్టీఆర్ జయంతి.. వర్దంతి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఆయన సేవలను గుర్తుచేసుకుంటారు అభిమానులు. గతేడాది తారక రామారావు శత జయంతి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఎంతో ఘనంగా నిర్వహించారు. మే 28న ఎన్టీఆర్ … Read more

హింసాత్మక ఘటనలకు తావులేకుండా జిల్లా ఎస్పీ గౌతమిశాలి IPS

జిల్లాలో హింసాత్మక ఘటనలకు తావులేకుండా కౌంటింగు రోజున పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా ఎస్పీ గౌతమిశాలి IPS

చట్ట వ్యతిరేక, అసాంఘిక శక్తుల ఏరివేత కోసమే కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు

అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమిశాలి IPS

జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్ల పరిధిల్లో ఈరోజు ఆరు చోట్ల కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లు నిర్వహించిన పోలీసులు

ఇదివరకే కేసులు ఉండటంతో పాటు ఈ ఎన్నికలలో ఘర్షణలకు పాల్పడిన 09 మందిపై రౌడీషీట్లు ఓపెన్

సమస్యలు సృష్టించే వీలున్న వారు, చెడు నడత కల్గిన వారిపై ముందస్తు చర్యలులో భాగంగా 795 మందిపై  బౌండోవర్లు

కౌంటింగు వేళ ఎలాంటి అల్లర్లు, ఘర్షణలకు వెళ్లొద్దని… ప్రశాంతంగా మెలగాలని సూచిస్తూ  141 మంది ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లకు కౌన్సెలింగ్

ప్రజల్లో ధైర్యం నింపడం… పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంచడానికి 12 చోట్ల ఫ్లాగ్ మార్చ్ లు

అల్లర్లు, ఘర్షణలు జోలికెళ్లకుండా ప్రజలలో చైతన్యం తేవడానికి 12 చోట్ల గ్రామసభలు

జిల్లా ఎస్పీ గౌతమి శాలి ఐపీఎస్

కౌంటింగు రోజున హింసాత్మక ఘటనలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోండి

జిల్లా ఎస్పీ గౌతమిశాలి IPS

జిల్లాలోని ఎస్సై, ఆపై స్థాయి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎస్పీ

జిల్లాలో హింసాత్మక ఘటనలకు తావులేకుండా కౌంటింగు రోజున పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా ఎస్పీ గౌతమిశాలి IPS  ఆదేశించారు

జిల్లాలోని ఎస్సై, ఆపై స్థాయి అధికారులతో ఎస్పీ  తన క్యాంపు కార్యాలయం నుండీ ఈరోజు జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రస్తుతం కొనసాగుతోన్న భద్రతా చర్యలను సమీక్షించారు

కౌంటింగు రోజున ఎలాంటి చర్యలు చేపట్టాలో దిశానిర్ధేశం చేశారు. కార్యాచరణ ప్రణాళికలతో జిల్లాలో ఎక్కడా శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టాలన్నారు

ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రౌడీషీటర్లు, కిరాయి హంతకులు, చెడునడత కల్గిన వారిని, సమస్యలు సృష్టించే ట్రబుల్ మాంగర్స్ ను ఎవర్నీ వదలకుండా ముందస్తు చర్యలులో భాగంగా బౌండోవర్లు చేయించాలన్నారు

ఇదివరకే కేసులు ఉండి ఇటీవల జరిగిన ఎన్నికలలో ఘర్షణలకు దిగిన వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేయాలని ఆదేశించారు. ఫ్యాక్షన్ ప్రభావిత సమస్యాత్మక గ్రామాల్లో పోలీసు పికెట్లు పటిష్టంగా నిర్వహించి ఆయా గ్రామాల్లోని తాజా పరిస్థితులపై సమాచారం సేకరించి తగు చర్యలు తీసుకోవాలన్నారు

ఫ్లాగ్ మార్చ్ లు, కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు, వాహనాల తనిఖీలు, గ్రామసభలు నిర్వహించడం విస్తృతం చేయాలన్నారు. డ్రోన్లు వినియోగించి ఫలితాలు వెల్లడయ్యాక విజయోత్సవ ర్యాలీలు నిర్వహించే వారిపై చట్టపరంగా చర్యలు చేపట్టాలన్నారు

144 సెక్షన్ తు.చ తప్పకుండా అమలు చేయాలని… ఐదుగురి కంటే మించి గుమిగూడితే ఉల్లంఘనల కింద చట్టపరంగా ముందుకెళ్లాలని సూచించారు. ఎన్నికల  పోటీ అభ్యర్థుల నివాసాలు, పరిసరాలలో భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటు సిసికెమేరాల పర్యవేక్షించాలన్నారు.

కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్ధిక సహాయం ఎస్పీ శ్రీ మాధవరెడ్డి

కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత…. జిల్లా పోలీస్ కార్యాలయంలో  AR కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల మృతి చెందిన చంద్రా నాయక్   కుటుంబానికి 50,000  రూ  రూపాయల చెక్కు ను అందజేసిన ఎస్పి శ్రీ ఎస్వీ.మాధవ్ రెడ్డి ఐపీఎస్ A R కానిస్టేబుల్ గా విధులు  నిర్వహిస్తూ,11-4-24  గుండెపోటుతో  మృతి చెందిన AR  కానిస్టేబుల్  చంద్ర నాయక్   కుటుంబానికి ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఎస్పి ఛాంబర్ నందు వారి  సతీమణి శాంతమ్మకు,జిల్లా ఎస్పీ … Read more

ఏపీలో కింగ్ మేకర్లు మహిళలే

ఏపీలో కింగ్ మేకర్లు మహిళలే !

తమదే అధికారం అంటూ క్షేత్రస్థాయికి సంకేతాలు పంపుతున్న ఇరు పార్టీలు

ఏపీలో రిజల్ట్ చెప్పడానికి సాహసం చేయలేని సెఫాలజిస్టులు, ఏజెన్సీలు

ఓ పార్టీ అధినేతను బొమ్మరిల్లు ఫాదర్ గా మార్చిన 2024 ఎన్నికలు

ఆ సామాజిక వర్గానికి సింగిల్ లీడర్ గా ఓ పార్టీ అధినేతను నిలబెట్టిన వైనం

సర్వశక్తులు ఎదురొడ్డి పోరాడాడన్న పేరు సంపాదించిన మరో పార్టీ అధినేత

అమరావతి : ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం కష్టంగా మారింది

గెలుపు పై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ వారి అంతరంగంలో ఉన్న గుబులు మాత్రం అలాగే ఉంటుంది

పేరు మోసిన సెఫాలజిస్టులు, ఏజెన్సీలు, విశ్లేషకులు సైతం ఏపీలో ఫలితాలను, గెలుపు అంచనాలను
ధైర్యంగా ప్రకటించేంత సాహసం చేయలేకపోతున్నారు

విశ్వసనీయతకు, అబద్ధపు హామీలకు మధ్యనే ఈ ఎన్నికలు జరిగాయని ప్రజలంతా గత ఐదేళ్లుగా చెప్పిన మాటను చెప్పినట్లుగా నిలబెట్టుకుంటున్న తమ పార్టీకి పట్టం కడతారని అధికార వైకాపా ధీమావ్యక్తం చేస్తోంది

మరోవైపు నియంతృత్వాన్ని నియంత స్వభావాన్ని కొనసాగిస్తున్న జగన్ పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, “ప్రభుత్వ వ్యతిరేక ఓటు” తమ సాంప్రదాయ ఓటు బ్యాంకుకు కలసి వచ్చి, అధికారం చేపట్టబోతున్నామని ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం మరియు కూటమి తమ విజయవకాశాలను గట్టిగానే విశ్వసిస్తున్నారు

అయితే ఈ ఎన్నికలు ఆయా పార్టీల అధినేతల తీరు తెన్నులను ప్రజాక్షేత్రంలో స్పష్టం చేశాయని చెప్పవచ్చు

చెప్పినవి చేశాం! చెప్పనివి చేశాం! అనే నినాదంతో ఎన్నికల బరిలోకి ధైర్యంగా సిద్ధమై వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయగలిగింది. అయితే ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత అనుసరించిన విధానాలు, వ్యూహం పరిశీలిస్తే


ఎక్కడా ఎలాంటి పొత్తులు లేకుండా సింగిల్ గా ఎన్నికల బరిలోకి దిగారు.. అదేవిధంగా ప్రచారాన్ని కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగిల్ గానే కొనసాగించారు. 2019 ఎన్నికలలో జగన్ కుటుంబ సభ్యులందరూ ప్రచారంలో రోడ్డుమీద ఉండగా

ఈ ఎన్నికలలో కేవలం ఒకే ఒక్క నినాదంగా అధినేత జగన్
పేరు మాత్రమే వినపడింది. పైగా తాను నమ్మిన ఐప్యాక్ బృందం వ్యూహం తప్ప, వేరే ఎవరికీ ఎక్కడా ఎలాంటి ఇతర వ్యూహం లేకుండా, ఏ దశలోనూ అస్పష్టత లేకుండా, తన కనుసన్నల్లోనే మొత్తం ఎన్నికల ప్రక్రియను జగన్ నిర్వహించగలిగారు

అభ్యర్థులకు సునాయాసంగా, అదనపు ఒత్తిడి లేకుండా ఈ వ్యూహం ఎంతో మద్దతుగా నిలిచినప్పటికీ, వారి మదిలో తమ అధినేతను బొమ్మరిల్లు ఫాదర్ గా నిలిపాయనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు

మరోవైపు “ప్రభుత్వ
వ్యతిరేక ఓటు చీల్నివ్వను” అనే ఏకైక నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన జనసేన పార్టీ కూటమి ఏర్పాటులో కీలక భూమిక వహించింది. 2019లో రాష్ట్రంలో ఒకే ఒక్క సీటు మాత్రమే సొంతం చేసుకున్న ఈ పార్టీ, 2024 ఎన్నికలలో మాత్రం కీలకంగా మారింది

పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఉన్న ప్రేక్షకాదరణను రాజకీయ ఆదరణగా మార్చుకోవడంలో, తన సామాజిక వర్గం నుండి అత్యధిక శాతం మద్దతును కూడగట్టడంలో విజయం సాధించగలిగారని చెప్పవచ్చు

ఇంకా చెప్పాలంటే ఆ సామాజిక వర్గ మొత్తానికి సింగిల్ లీడర్ గా, ఐకానిక్ పర్సనాలిటీగా ఈ ఎన్నికలు ఆయనకు గుర్తింపు తెచ్చి, గతం కంటే మెరుగ్గా నిలబెట్టాయని తెలుస్తోంది.

ఏడు పదుల వయసులో కూడా ఒక రాజకీయ పార్టీకి సంపూర్ణ సారధ్యం వహించడం, కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికల బరిలో తన పూర్తి సామర్థ్యంతో పని చేశారనే
ఖ్యాతిని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంతం చేసుకున్నారు.

మొత్తం ఎన్నికల ప్రక్రియలో తన అనుభవసారాన్ని, కూటమి మద్దతును పూర్తిగా వినియోగించి అధికార పార్టీకి గట్టి పోటీని ఇవ్వగలిగారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటును పూర్తిగా తమకు అనుకూలంగా మలుచుకోవాలనే సందేశాన్ని, అధికారంలోకి వస్తామని విశ్వాసాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లగలిగారు.

ఇక అసలు విషయానికొస్తే ఈ ఎన్నికలలో నిజమైన “కింగ్ మేకర్స్” గా నిలుస్తుంది రాష్ట్రంలోని మహిళా ఓటర్లు మాత్రమే!

ప్రతిసారి ఎన్నికలలో మహిళా ఓట్లే కీలకం అనే నానుడి ప్రచారంలో కొనసాగుతున్నప్పటికీ, ఈ ఎన్నికల్లో మాత్రం “అధికార కిరీటం” ఎవరిని వరించాలనే అంశం పూర్తిగా వారి నిర్ణయాన్ని బట్టే ఉంటుంది.

ఎవరికి వారు తమ సర్వశక్తులను ఎదురొడ్డి ఎన్నికల బరిలో తమ ప్రతాపాన్ని ప్రదర్శించారు.

అయితే ఎవరి సంప్రదాయ ఓటు బ్యాంకు వారికే బలంగా నిలవనుండగా, అధికార అందలాన్ని ఎక్కించే కీలక ఓటు మాత్రం మహిళల చేతిలోనే ఉందని స్పష్టమవుతోంది

ఓటింగ్ సరళిని పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బాహాటంగా పోలింగ్ కు హాజరై గతంలో కంటే మెరుగ్గా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పురుష సమాజం రెండుగా చీలిపోయి, ఎవరు ఏ పార్టీకి మద్దతుగా నిలిచారనే విషయం దాదాపుగా స్పష్టం అవుతున్న వేళ, మహిళా ఓటు మాత్రం అత్యంత గోప్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు 2014 ఎన్నికలలో ఇదే కూటమి అధికారం సాధించిన నేపథ్యంలో, అధికార పార్టీపై మహిళల్లో ఏ మాత్రం వ్యతిరేకత ఉన్నా,అది ప్రతిపక్షానికి బలంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

రెంటచింతల: ఏజెంట్లపై దాడి కేసులో 12 మందికి రిమాండ్

రెంటచింతల: ఏజెంట్లపై దాడి కేసులో 12 మందికి రిమాండ్

పల్నాడు జిల్లా, రెంటచింతల మండలంలోని రెంటాలలో ఈ నెల 13న ఏజెంట్లపై దాడి కేసులో 12 మందిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ ఎం. ఆంజనేయులు ఆదివారం తెలిపారు.

దాడిలో గాయపడిన చేరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, చేరెడ్డి మంజుల, గొంటు నాగమల్లేశ్వరరెడ్డి, చేరెడ్డి రఘురామిరెడ్డిల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

12 మందిని గురజాల జూనియర్ సివిల్ జిడ్జి ముందు హాజరు పరచగా, వారికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు.

రుణమాఫీకి సర్వం సిద్ధం.. డిసెంబర్ 9 కటాఫ్ ?

రుణమాఫీకి సర్వం సిద్ధం.. డిసెంబర్ 9 కటాఫ్ ?

TG: రాష్ట్రంలో రుణమాఫీకి డిసెంబర్ 9 కటాఫ్ తేదీగా ప్రభుత్వం ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15లోగా రుణమాఫీ కానుంది

కుటుంబానికి రూ.2 లక్షలు మాఫీ చేయనున్నారు. రూ.2 లక్షల కంటే ఎక్కువుంటే మిగతాది చెల్లించాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే అన్నీ కలిపి లెక్కించనున్నారు

బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న అప్పు కూడా మాఫీ కానుంది. దీర్ఘకాలిక రుణాలకు మాత్రం మాఫీ వర్తించదని టాక్

BREAKING: ముంబై తాజ్ హోటల్ కు బాంబు
బెదిరింపు

ముంబై తాజ్ హోటల్ కు బాంబు
బెదిరింపు

దేశంలో ఇటీవల బాంబు బెదిరింపులు కలకలం
రేపుతున్నాయి. తాజాగా ముంబైలోని తాజ్
హోటల్, ఛత్రపతి శివాజీ మహరాజ్
అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు
బెదిరింపు కాల్స్ వచ్చాయి

దీంతో
అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాల్లో
సోదాలు నిర్వహించగా అనుమానాస్పదంగా
ఏమీ కనిపించకపోవడంతో ఊపిరి
పీల్చుకున్నారు. ఆ కాల్ యూపీ నుంచి
వచ్చిందని, నిందుతుడి కోసం గాలిస్తున్నట్లు
తెలిపారు