కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పురం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతా.

కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పురం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతా. — ఎం.హెచ్.ఇనాయతుల్లా వెల్లడి. హిందూపురం (HR9news) అఖిలభారత కాంగ్రెస్ పార్టీ  మద్దతుతో  హిందూపురం అసెంబ్లీ నియోజక వర్గం  నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి సిద్ధంగా ఉన్నానని స్థానిక  సీనియర్ నాయకులు ఎమ్.హెచ్. ఇనాయతుల్లా  పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు.ఇటీవల రెండు రోజుల క్రితం బెంగళూరులో జాతీయ నాయకులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పరిస్థితుల గురించి … Read more

ఎన్నికల నిఘా వేదికకు పూర్తి సహకారం అందిస్తాం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి.

ఎన్నికల నిఘా వేదికకు పూర్తి సహకారం అందిస్తాం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి. ఎస్పీ గారికి మొక్కను అందజేసిన DR భాస్కర్ నాయుడు. ఎన్నికల నిఘావేదిక సత్య సాయి జిల్లా సమన్వయకర్తల జాబితా జిల్లాఎస్పీ మాధవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు గార్లకు అందజేసిన ఉభయ జిల్లాల కోఆర్డినేటర్ కంబదూరి షేక్ నబిరసూల్, సత్యసాయిజిల్లా కోఆర్డినేటర్ ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు.మంగళవారం ఎస్పీ గారి కార్యాలయంలో కలిసి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘంచే గుర్తింపు పొందిన,ఎన్నికల నిఘా … Read more

చంద్రబాబు నాయుడు గారిని భేటీ అయిన సామకోటి

ఉండవల్లి నివాసంలో చంద్రబాబు నాయుడు గారిని భేటీ అయిన సామకోటిపార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సామకోటిని అభినందించిన టిడిపి అధినేతరాబోయే రోజుల్లో తగిన గుర్తింపు వచ్చే విధంగా  చంద్రబాబు భరోసా విజయవాడ ఉండవల్లి నివాసంలో  అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల కోసం పోరాడుతూ పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న స్వర్ణాంధ్ర సృష్టికర్త అమరావతి అభివృద్ధి ప్రదాత *తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు … Read more

అనంతపురంలో జరిగిన ‘న్యాయసాధన’ సభ

ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో అనంతపురంలో జరిగిన ‘న్యాయసాధన’ సభకు తరలివచ్చిన అశేష కార్యకర్తలకు, నాయకులకు, వైఎస్సార్ అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతున్నా అభివృద్ధిలో పట్టుమని పది అడుగులు కూడా ముందుకు పడలేదు. రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల విషయంలోనూ అటు టీడీపీ, ఇటు వైసీపీ.. రెండు పార్టీలు కేంద్రంలోని మోదీ సర్కార్‌కు సాగిలపడి వంగి మరి దండాలు పెట్టాయి తప్ప రాష్ట్ర శ్రేయస్సు కోసం మోదీని ఎదిరించలేదు. … Read more

కాంగ్రెస్ సభకు భారీగా తరలిన పురం కాంగ్రెస్ నాయకులు

అనంతపురం నగరంలో సోమవారం నిర్వహించిన అఖిలభారత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమరభేరి మహాసభకు హిందూపురం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు ఈ సందర్భంగా రాబోవు ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా లేదా పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలవాలనిఆశిస్తూ అందుకు తగ్గట్టుగా పార్టీ అధిష్టానానికి తమ బయోడేటను అందించిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ కౌన్సిలర్ ఎంఏ రహుఫ్ ఆధ్వర్యంలో హిందూపురం నుండి దాదాపు 200 మంది ఒక బస్సు,15 కార్లలో … Read more

అనుచరులతో పార్థసారథి సమావేశం

HR9NEWS: పెనుగొండ ఎమ్మెల్యే టికెట్ కోసం పోరాడుతా: బీకే పార్థసారథి పెనుకొండ టికెట్ కోసం చివరి వరకు పోరాడుతానని మాజీ MLA బీకే పార్థసారథి అన్నారు. నిన్న TDP అధిష్ఠానం ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో పార్థసారథికి కాకుండా సబితమ్మకు టికెట్ కేటాయించారు. దీంతో ఆయన అలకబూనారు. ఆదివారం పెనుకొండలోని తన కార్యాలయంలో అనుచరులతో పార్థసారథి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో TDP ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్నీ నిర్వహించానని, తన ఆవేదనను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.

అమరావతి : సీట్లు పొందిన అభ్యర్థులతో టీడీపీ అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్, టికెట్లు వచ్చాయని నిర్లక్ష్యం తగదన్న చంద్రబాబు సర్వేల్లో తేడా వస్తే అభ్యర్థులను మార్చేందుకూ వెనకాడబోం – ఎన్నికల వరకు ప్రతి వారం సర్వే చేపడతాం – జనసేన కేడర్ తో సమన్వయం చేసుకుంటూ వెళ్లాలి : టీడీపీ అధినేత చంద్రబాబు

ఫ్లెక్సీలను తగలబెట్టిన బీకే అభిమానులు

BK Parthasaradhi Flexi

శ్రీ సత్య సాయి జిల్లా, హిందూపురం టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి గా సవితమ్మను ప్రకటించడంతో ఒక్కసారిగా మాజీ ఎమ్మెల్యే బి.కె పార్థసారథి అభిమానులు రెచ్చిపోయి తీవ్ర అలజడి సృష్టించిన సంఘటన చోటు చేసుకుంది ఈ సందర్భంగా కష్టాల్లో పార్టీని కంటికి రెప్పలా కాపాడి నాయకులకు అండగా నిలిచిన బి.కె పార్థసారథి ని కాదని నిన్న మొన్న వచ్చిన సవితమ్మకు ఏ రకంగా టిడిపి … Read more

చలో సెక్రటేరియట్ కార్యక్రమంలో APCC చీఫ్ వైఎస్ షర్మిల ఫుల్ స్పీచ్..

HR9News

  వైసీపీ నియంత పాలనలో మెగా డీఎస్సీనీ దగా డీఎస్సీ చేశారని నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారు.మా చుట్టూ వేలాది మంది పోలీసులను పెట్టారు. ఇనుప కంచెలు వేసి మమ్మల్ని బందీలు చేశారు.నిరుద్యోగుల పక్షాన నిలబడితే అరెస్టులు చేస్తున్నారు.మమ్మల్ని ఆపాలని చూసే మీరు ముమ్మాటికీ నియంతలే.ఇందుకు మీ చర్యలే నిదర్శనం.CWC సభ్యులు గిడుగు రుద్రరాజు,వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.23 వేల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి 6 వేలకే నోటిఫికేషన్ ఇచ్చినందుకు … Read more