హిందూపురం
సెబ్ స్టేషను పరిధి లో పోచానపల్లి నుండి హిందూపూరం కి వచ్చే రహదారి లో పెన్నా నది వంతెన వద్ద కర్ణాటక మద్యం రవాణా యొక్క రాబడిన సమాచారం.
హిందూపురం సెబ్ స్టేషన్ ఎస్ఐ లు రామ ప్రసాద్, కమలాకర్ లు వారి సిబ్బంది వాహనాల తనిఖీ జరుపుతుండగా హోండా యాక్టివా స్కూటర్ వాహనం పై సోమనాహల్లి, బెంగుళూర్ కి చెందిన రాకేష్ అనే వ్యక్తి తన స్కూటర్ నందు రెండు గోనె సంచులలో 12 బాక్సుల కర్నాటక మద్యం ఉండి ఒక్కొక్క దానిలో 96 లెక్కన మొత్తం ఆ స్కూటర్ నందు 1152 Haywards cheers whisky కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు ను రవాణా చేస్తుండగా అతనిని పట్టుకొని విచారించగా హిందూపురం లో ఒక వ్యక్తి చెపితే ఈ మద్యం బాక్సులు తీసుకువస్తున్నట్టు తెలిపాడని అతనిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని , స్కూటర్, మద్యం ని సీజ్ చేసి రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్టు హిందూపురం సెబ్ సిఐ రాజశేఖర్ గౌడ్ తెలిపారు.
తదుపరి లేపాక్షి మండల పరిధిలోని మామిడాకుల పల్లి క్రాస్ వద్ద వాహనాల తనిఖీ జరుపుతుండగా మామిడాకుల పల్లి గ్రామానికే చెందిన వ్యక్తి పల్సర్ మోటార్ సైకిల్ KA 04 AE 8152 వాహనం పై ఒక గోనె సంచి లో 4 అట్టపెట్టెలలో old Tavern whisky (180 ml) 192 టెట్రా ప్యాకెట్లను రవాణా చేస్తుండగా అతనిని అరెస్ట్ చేసి వాహనము తో సహా సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు సెబ్ సిఐ తెలిపారు.
ఈ దాడులలో ఎస్ఐలు రాంప్రసాద్ , కమలాకర్ సిబ్బంది రమణ, ఆంజనేయులు, ప్రకాష్, భాస్కర్, వెంకటేష్ లు పాల్గొన్నారు.