వాము పక్షాలద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు కడప నగరంలోనిసిపిఎం జిల్లా కార్యాలయం లో విద్యుత్ అమరవీరుల సంస్కరణ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కామనూరు శ్రీనివాస్ రెడ్డి బి దస్తగిరి రెడ్డి ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని వారు మాట్లాడుతూ 2000 సంవత్సరం ఆగస్టు 23న ఆనాటి పాలకులు ప్రపంచ బ్యాంకు షరతులో భాగంగా విద్యుత్ చార్జీల పెంపుకు పూనుకున్నారు దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వామపక్షాలు కాంగ్రెస్ శ్రేణులు కలిసి పెద్ద ఎత్తున పెంచిన విద్యుత్ ఛార్జింగ్ తగ్గించాలని ఉద్యమం నిర్వహించారు.
ఆ ఉద్యమం అనంతరం చలో హైదరాబాద్ పిలిపియడం జరిగింది 60 మంది శాసనసభ్యులు ఆమర నిరాహార దీక్ష చేస్తున్న కూడా అప్పటి ప్రపంచ బ్యాంకు విధానాలుఅమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రదర్శన చేస్తున్న కార్యకర్తల పైన లాఠీలు తూటాలు ఉపయోగించడం జరిగింది.
ఈ దాడుల్లో సిఐటియు సిపిఎం రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు ముగ్గురు ప్రాణాలు అర్పించడం జరిగింది. వారికి స్ఫూర్తిగా రేపు జరగబోయే సంస్కరణ సభను జయప్రదం చేయాలి అట్లాగే నేటి పాలకులు తిరిగి విద్యుత్తులో స్మార్ట్ మీటర్ల వ్యవస్థను తీసుకురావడం జరిగింది.
ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్ల ప్రక్రియ నిలిపివేయాలి రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు, నివాస గృహలకు విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని సిపిఎం జిల్లా కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని
డిమాండ్ చేసింది.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాదేశాలకు లొంగి రాష్ట్రంలోని నివాస గృహాలకు
విద్యుత్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టాలని గత వైసిపి ప్రభుత్వం నిర్ణయించిందని, అదే విధానాన్ని తెలుగు దేశం కూటమి ప్రభుత్వం అమలుకు సిద్ధపడడం సరికాదని కామననురు శ్రీనివాసులురెడ్డి పార్టీ జిల్లా కమిటీ సభ్యులు విమర్శించారు.
అదానీ మరియు షిరిడి సాయి
తదితర కంపెనీలకు కాంట్రాక్టులను కట్టబెట్టడం వెనుక పెద్ద ఎత్తున
అవినీతి చోటు చేసుకున్నది. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండగా ఈ మీటర్లను
వ్యతిరేకించింది. హైకోర్టులో పిటీషన్లు వేశారు. నేడు తెలుగుదేశం కూటమి
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒప్పందాలను రద్దు చేయకపోగా
స్మార్ట్ మీటర్ల ప్రక్రియను కొనసాగిసించడానికి నిర్ణయించు కోవడం ఏమిటని ప్రశ్నించారు.
విజయవాడతో సహా పలు ప్రాంతాల్లో అదానీ సంస్థకు చెందిన మీటర్లను తెచ్చి విద్యుత్ కార్యాలయాల్లో భద్రపరుస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ మీటర్లు బిగిస్తున్నారు. తదుపరి వ్యవసాయ పంపు సెట్లకు, నివాస గృహాలకు మీటర్లు బిగించే ప్రక్రియకు సిద్ధమవుతున్నారు.
మొదటి దశలో వ్యవసాయం పంపు సెట్లకు మీటర్ల పేరుతో క్రమంగా ఉచిత విద్యుత్తుకు ఎసరుపెట్టే ప్రమాదం ఉంది.
నివాస గృహాలకు మీటర్లతో ప్రీపెయిడ్
పద్ధతి మరియు విద్యుత్ వాడే సమయాన్నిబట్టి అదనపు చార్జీలు, మీటర్ల ఖర్చును
వినియోగదారులపై వేయటం తదితర రూపాల్లో భారం పడుతుందన్నారు. వేలాదికోట్ల రూపాయల ప్రజాధనం మీటర్ల పేరుతో దుర్వినియోగం అవుతుంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాట తప్పి కేంద్ర ప్రభుత్వాదేశాలకు లొంగిపోయింది.
గతంలో
వ్యతిరేకించిన మీటర్లనే కొనసాగించడం వాగ్దాన భంగమే అవుతుంది. బి దస్తగిరి మాట్లాడుతూ
వ్యవసాయ పంపు సెట్లకు, నివాస గృహాలకు స్మార్ట్ మీటర్లను నిలిపివేయాలని
సిపిఎం డిమాండ్ చేస్తోంది. ఆదాని, షిర్డీ సాయి తదితర కంపెనీలతో చేసుకున్న
ఒప్పందాలను రద్దు చేయాలని, బిగించిన మీటర్లను తొలగించాలని . అప్పుడే నిజమైన విద్యుత్ ఉద్యమంలో అమరులైన వారికి మనం నివాళులు అర్పించడం అవుతుంది.
ఈ కార్యక్రమానికి వామపక్ష జిల్లా కార్యదర్శి ,ప్రజాతంత్ర వాదులు పాల్గొంటున్నారు ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరుచున్నాము సిపిఎం జిల్లా కమిటీ
విజ్ఞప్తి చేస్తున్నది.