మహా విషాదం.. 2వేలు దాటిన మరణాలు
పపువా న్యూగినియా:
ఇండోనేషియాకు సమీపంలో ఉండే పపువా న్యూగినియాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరణాల సంఖ్య 2వేలు దాటింది.
శుక్రవారం తెల్లవారుజామున భారీగా కొండచరియలు విరిగి పడ్డాయి.
ఈ ఘటనలో మరణాలు 2 వేలు దాటినట్లు ఆ దేశం ఐక్యరాజ్య సమితికి నివేదిక సమర్పించింది.
భారీగా నష్టం వాటిల్లిందని, ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు సహాయక చర్యలు
కొనసాగుతున్నాయి.కొండలను ఆనుకొని గ్రామాలు ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉంది.