శ్రీ సత్య సాయి జిల్లా, హిందూపురం
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి గా సవితమ్మను ప్రకటించడంతో ఒక్కసారిగా మాజీ ఎమ్మెల్యే బి.కె పార్థసారథి అభిమానులు రెచ్చిపోయి తీవ్ర అలజడి సృష్టించిన సంఘటన చోటు చేసుకుంది ఈ సందర్భంగా
కష్టాల్లో పార్టీని కంటికి రెప్పలా కాపాడి నాయకులకు అండగా నిలిచిన బి.కె పార్థసారథి ని కాదని నిన్న మొన్న వచ్చిన సవితమ్మకు ఏ రకంగా టిడిపి టికెట్ ఇస్తారని టిడిపి నాయకులు కోపద్రకులై పెనుగొండ పట్టణంలోని బి.కె పార్థసారథి స్వగృహం సమీపంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు దగ్ధం చేసి అధిష్టానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు, ఇక పరిగి మండల్ టిడిపి కన్వీనర్ లక్ష్మిరెడ్డి ఏకంగా చంద్రబాబు నాయుడుకే ఛాలెంజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ సెల్ అవుతుంది.
గత 30 సంవత్సరాలుగా ఒకే పార్టీలో ఉంటూ ప్రజల అండతో వివిధ హోదాల్లో పని చేస్తూ నియోజవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసి ఈ ఐదు సంవత్సరాల లో ప్రజా సమస్యలపై వైసిపి ప్రభుత్వంతో పోరాడి టిడిపి నాయకులకు కార్యకర్తలకు అండగా నిలిచి వారిని అన్నింటిలో కాపాడిన బి కే పార్థసారథి నీ కాదని నిన్న మొన్న వచ్చిన నాయకురాలు అదికూడా పార్టీలు మారిన సవితమ్మకు ఏ రకంగా టికెట్ ప్రకటిస్తారని చంద్రబాబు నాయుడుకు పరిగి మండల టిడిపి కన్వీనర్ లక్ష్మి రెడ్డి ఓ వీడియో ద్వారా ప్రశ్నించిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతుంది.
ప్రశ్నించారు, ఇంతకీ నీకు నైతిక విలువలు ఉంటే పార్థసారథికి కాదని సవితమ్మకు ఏ రకంగా టికెట్ ప్రకటించారు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు, ఆమె భర్త ఓ కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడని దీన్ని దృష్టిలో పెట్టుకొని అత్యధిక కురుబ సామాజిక వర్గానికి చెందిన కురుబ బి.కె పార్థసారథి కి అన్యాయం చేస్తావా అంటూ ప్రశ్నించారు, పెనుగొండలో టిడిపి గెలుస్తుందా వైసిపి గెలుపుకు నీవే దారి చూపించావు కాస్కో చంద్రబాబు నాయుడు అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
మంగళగిరిలో నీ కొడుకు లోకేష్ ఓడిపోతే ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చావు ఇదా నీవు చేసే పని ఇదా నీకున్న నైతిక విలువలు అంటూ ప్రశ్నించారు.
ఎప్పుడు పడితే అప్పుడు నీవు నీ కొడుకు పెనుగొండ ఖరావడం బి.కె పార్థసారథి లక్షలాది రూపాయలు ఖర్చు చేయించడం తోపాటు గొడ్డు చాకిరి చేయించుకొని ఈరోజు బికే పార్థసారథికి అన్యాయం చేస్తారా ఏ విధంగా టిడిపి గెలుస్తుందో చూస్తామంటూ పరిగి టిడిపి కన్వీనర్ లక్ష్మి రెడ్డి టిడిపి అధినాయకుడికే ఛాలెంజ్ చేశారు
బైట్స్….
లక్ష్మి రెడ్డి, టిడిపి కన్వీనర్ పరిగి మండల్
చలో సెక్రటేరియట్ కార్యక్రమంలో APCC చీఫ్ వైఎస్ షర్మిల ఫుల్ స్పీచ్..