నర్సు వేషంలో వచ్చి మగ శిశువును దొంగలించింది

HR9NEWS T MAHESH

ఆస్పత్రిలో పసికందు అదృశ్యం.. గంటల వ్యవధిలోనే బిడ్డను తల్లికి అప్పగించిన పోలీసులు

కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వాస్పత్రిలో మూడు రోజుల పసి కందు అదృశ్యం కలకలం సృష్టించింది.

శనివారం రాత్రి గుర్తు తెలియని మహిళ.. నర్సు వేషంలో వచ్చి మగ శిశువును అపహరించుకుపోయింది.

కాసేపటికి గమనించిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా గంటల వ్యవధిలోనే అదృశ్యం అయిన శిశువును పట్టుకుని తల్లి చెంతకు చేర్చారు.

వివరాల్లోకి వెళితే ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామానికి చెందిన స్వరూప మూడు రోజుల క్రితం మగ బిడ్డకు జన్మనిచ్చింది.

శనివారం రాత్రి 1.30 గంటల సమయంలో ఓ మహిళ నర్సు వేషంలో వచ్చి  బాబుని తీసుకువెళ్లిపోయింది.

స్వరూప ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు.

గంటల వ్యవధిలోనే శిశువును ఎత్తుకెళ్లిన మహిళను ఇంగ్లీష్ పాలెంలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Leave a Comment