ఆర్టీవో ఆఫీస్ నుండి జారీ చేయాలి సిఐటియు

డ్రైవింగ్ లైసెన్సులను ప్రభుత్వం ద్వారానే ఆర్టీవో ఆఫీస్ నుండి జారీ చేయాలి . ట్రాన్స్ పోర్టు జిల్లా ప్రధాన కార్యదర్శి పెడబల్లి బాబా పెనుకొండ పట్టణం సిఐటియు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి ఈ సందర్భంగా ట్రాన్స్ ఫోర్ట్ రంగం జిల్లా ప్రధాన కార్యదర్శి పెడపల్లి బాబా మాట్లాడుతూ

జూన్ 1 నుండి ప్రైవేట్ సంస్థల ద్వారా డ్రైవింగ్ లైసెన్సులను ఇవ్వాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలను ప్రవేశపరం చేయాలనే నిజములో భాగంగా ట్రాన్స్పోర్ట్ రంగానికి గుండెకాయగా ఉండే

ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తూ ప్రజల భద్రత రిత్యా డ్రైవింగ్ లైసెన్స్ ను జారీ చేసే సందర్భంలో అనేక కొలమానాలతో ఎ డ్యూ కేట్ చేసే విధానాన్ని తుంగలో తొక్కి ప్రైవేట్ సంస్థలకు డ్రైవింగ్ లైసెన్సులను ఇచ్చే అనుమతి (2024 జూన్ 1 నుండి) నిర్ణయాన్ని సిఐటియు

జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ

ప్రజల భద్రతకు ప్రాణాలకు సంబంధం కలిగి ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ లోనూ డబ్బే కొలమానంగా బాధ్యత రహితంగా ఉండే ప్రైవేట్ సంస్థలకు డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేసే అవకాశాన్ని కల్పించడం అంటే ప్రజల భద్రతకు ప్రాణాలకు కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ నిర్ణయం ద్వారా తెలుస్తుంది

అదేవిధంగా ఆర్టీవో ఆఫీస్ నిర్వహణలో కీలకమైన డ్రైవింగ్ లైసెన్సుల మంజూరు ప్రభుత్వానికి పెద్ద ఆదాయ వనరుగా ఉంది డ్రైవింగ్ లైసెన్సులను ఆర్టీవో ఆఫీసుల నుండి తొలగిస్తే ఆర్టీవో ఆఫీసులో నష్టాల్లోకి వెళ్తుంది. తద్వారా పూర్తిగా ప్రస్తుత ట్రాన్స్ పోర్ట్ రంగం సర్వీసులను ప్రైవేటుపరం చేయాలని దుర్మార్గ ఆలోచన ప్రభుత్వం చేస్తుంది

తద్వారా ప్రజల పైన టాక్స్ ల రూపంలో బారాలు పడతాయి కావున ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం

లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్టీవో కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా తెలియజేశారు

ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బాబావలి, మా భాష, ఆటో యూనియన్ నాయకులు తిప్పన్నా, నాగప్ప, షరీఫ్, రాజగోపాల్, రంగప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment