కౌంటింగ్ ప్రాంతాలలో  నాలుగంచెల  భద్రత ఏర్పాట్లు

శ్రీ సత్య సాయి జిల్లా :

భారీ ఎత్తున పోలీస్ బలగాల మోహరింపు

కౌంటింగ్ ప్రాంతాలలో  నాలుగంచెల  భద్రత ఏర్పాట్లు

ప్రశాంత కౌంటింగ్ నిర్వహణ లక్ష్యం…

కేంద్ర సాయుధ బలగాలు మరియు రాష్ట్ర బలగాలు రంగంలో …
నిరంతరం డ్రోన్, సిసి కెమెరాలతో నిఘా .. జిల్లా ఎస్పీ…

కౌంటింగ్ సందర్భంగా నాలుగంచెల పటిష్ట భద్రత ఏర్పాట్లతో ప్రశాంత కౌంటింగ్ నిర్వహణ లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలు మరియు రాష్ట్ర బలగాలనుతో అన్ని భద్రత చర్యలు చేపట్టినట్లు  శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ వి మాధవ్ రెడ్డి ఐపీఎస్ తెలిపారు.  కౌంటింగ్ సందర్భంగా  2, ఎస్పీలు, ,3, ఏఎస్పీలు, 10, డీఎస్పీలు 42, సిఐలు, 68, ఎస్ఐలు, 326, ఏఎస్ఐలు, 500, పోలీసులు, 300, హోంగార్డులు, 60, మహిళా పోలీసులు, తోపాటు 120 ,మంది ఏఆర్  కానిస్టేబులు, 80, మంది ఏపీఎస్పీ పోలీసుల  తోపాటు జిల్లావ్యాప్తంగా 110, (క్యూఆర్టీ టీములు)   కేంద్ర సాయుధ   బలగాలు , గ్రేహౌండ్స్ బలగాలు, ఏర్పాటు చేయడం జరిగింది ఎస్పీ గారు తెలిపారు. అంతేకాక నిరంతరం డ్రోన్ ,సిసి కెమెరాలు పర్యవేక్షణ ఉంటుందన్నారు

కౌంటింగ్ జరిగే ప్రాంతాలలో పటిష్టంగా  భద్రతతో పాటు ఆయా ప్రాంతంలో లోపల ,వెలుపల ఏర్పాట్లు వాహనాల పార్కింగ్ మరియు బందోబస్తు  ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టమన్నారు. లేపాక్షి గురుకుల పాఠశాల బిట్స్ కళాశాలలోకి వెళ్లొచ్చేందుకు ఎంట్రీ ..ఎగ్జిట్ మినహాయించి మార్గాలేవి  లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని , ఎన్నికల నియమాలు అమలులో ఉన్నందున జిల్లావ్యాప్తంగా ఎటువంటి సంఘటన తలెత్తకుండా 144 సెక్షన్ విధించడం జరిగిందని, 30 పోలీస్ యాక్టులు అమలులో ఉన్నాయన్నారు, గుంపులుగా ఎవరు ఉండకూడదని . కౌంటింగ్ అనంతరం , 6 న సాయంత్రం వరకు ఎన్నికల నియమాలు వర్తిస్తాయని  విజయోత్స ర్యాలీలకు అనుమతులు లేవన్నారు. ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి ర్యాలీలు సమావేశం నిర్వహించరాదన్నారు. బాణసంచాలు కాల్చడం నిషేధం అన్నారు . ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాలలో నిక్లిప్తమై ఉంటాయని , తదుగుణంగా చర్యలు తీసుకోబడతాయని ఎస్పీ గారు హెచ్చరించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు తప్పమన్నారు. నిరంతరం డ్రోన్, సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని ,    పోలీస్ కార్యాలయం లో కమాండ్, కంట్రోల్ నుంచి సిసి కెమెరాలు ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఎవరైనా అల్లర్లు గొడవలు సృష్టించిన  అటువంటి వారిపై తక్షణమే కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎస్పీ గారు తెలియజేశారు. సమసాత్మకమైన  ప్రాంతాలను ఇబ్బంది కలిగించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు.  కీలకమైన కౌంటింగ్ ప్రక్రియను కూడా ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అన్ని చర్యలు చేపట్టినట్లు ఎస్పీ  తెలిపారు.

Leave a Comment