కంభం సర్కిల్ పరిధి లోని ప్రజానీకానికి పోలీసు వారి హెచ్చరిక

కంభం సర్కిల్ పరిధి లోని ప్రజానీకానికి పోలీసు వారి హెచ్చరిక

జూన్ 4వ తారీఖున జరుగు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కంభం సర్కిల్  పరిధి నందు ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా కంభం సర్కిల్  పరిధి నందు 144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్  అమల్లో ఉన్నందున నలుగురు అంతకంటే ఎక్కువగా ఎక్కడ గుమిగుడి ఉండరాదు

కంభం సర్కిల్  పరిధి లోని కంభం, బెస్తవారిపేట, అర్ధవీడు అంతా సీసీ కెమెరా నిఘా లో ఉన్నది. జూన్ 3 వ  తేదీ రాత్రి నుండి 4 వ తేదీ రాత్రి వరకు కంభం సర్కిల్  పరిధిలో రెస్టారెంట్లు కానీ, హోటల్స్ కానీ లాడ్జీలు అన్ని  మూసి వేయవలెను,  ఎక్కడ గాని బహిరంగ భోజనాలు కానీ , సంబరాలు కాని చేయరాదు

లాడ్జిల్లో, కళ్యాణ మండపాల్లో వేరే ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఉండరాదు. జూన్ 6 వ  తేదీ వరకు ఎటువంటి ఉత్సవాలు కానీ సంబరాలు కాని చేయుటకు  పర్మిషన్  లేదు. ఎవరైనా రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం కానీ బాణాసంచాలు కాల్చడం కానీ చేయరాదు. ఎవరైనా ఈ పోలీస్ వారి ఉత్తర్వులు పాటించనట్లయితే వారిపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని రౌడీషీట్స్ ఓపెన్ చేయబడును.

Leave a Comment