ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి జరిగిన భారీ పోలింగ్ నేపథ్యంలో ఫలితాలపైనా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా గతంతో పోలిస్తే పెరిగిన పోలింగ్ శాతం, రాష్ట్రం బయట ఉన్న వారు భారీగా వచ్చి పోలింగ్ లో పాల్గొనడం
వైసీపీ, కూటమికి మధ్య జరిగిన హోరాహోరీ పోరు నేపథ్యంలో ఫలితాలపై ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఇవాళ ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈసారి ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలు 8 వేల కోట్లు, 6 వేల కోట్ల చొప్పున ఖర్చు పెట్టాయని రఘువీరారెడ్డి వెల్లడించారు. వారితో పోటీ పడి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లలో గెలిచే పరిస్ధితి లేదన్నారు
కాంగ్రెస్ ఈసారి డబ్బు ప్రభావం పనిచేయని రెండు, మూడు సీట్లలో గెలిచే అవకాశం ఉందన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎంపీ సీట్లలో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు భావిస్తున్నట్లు రఘువీరా తెలిపారు.
అలాగే ఈసారి ఎన్నికల్లో ఎవరికీ గాలి లేదని రఘువీరా తెలిపారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 2009 రిపీట్ అవుతుందేమో అనిపిస్తోందన్నారు
అప్పటి ఎన్నికల్లోనూ తమకు నామమాత్రపు సీట్లతో మెజార్టీ వచ్చిందన్నారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు
అయితే ఏ పార్టీ ఇలా బయటపడుతుందో మాత్రం ఆయన చెప్పలేదు.గెలిచే వారికి మాత్రం 95-97 సీట్లే వస్తాయన్నారు. అలాగే 100 మంది ఎమ్మెల్యేలకు మెజార్టీ 10 వేల లోపే ఉంటుందన్నారు. కచ్చితంగా ఇది క్లోజ్ ఫైట్ అన్నారు.