ఎన్నికల నిఘా వేదికకు పూర్తి సహకారం అందిస్తాం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి.

ఎన్నికల నిఘా వేదికకు పూర్తి సహకారం అందిస్తాం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి.


ఎస్పీ గారికి మొక్కను అందజేసిన DR భాస్కర్ నాయుడు.


ఎన్నికల నిఘావేదిక సత్య సాయి జిల్లా సమన్వయకర్తల జాబితా జిల్లాఎస్పీ మాధవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు గార్లకు అందజేసిన ఉభయ జిల్లాల కోఆర్డినేటర్ కంబదూరి షేక్ నబిరసూల్, సత్యసాయిజిల్లా కోఆర్డినేటర్ ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు.
మంగళవారం ఎస్పీ గారి కార్యాలయంలో కలిసి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘంచే గుర్తింపు పొందిన,ఎన్నికల నిఘా వేదిక సంఘం సభ్యుల వివరాలు, ఫోన్ నెంబర్లు అందజేశారు. జిల్లాలో ఎన్నికలు సజావుగా నిర్వహింపబడటానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని భారత రాజ్యాంగ ఎన్నికల నియమావళి ప్రకారం ఎవరు ఉల్లంఘనలకు పాల్పడినా ఎన్నికల కమిషన్కు తెలియజేస్తారని, ఓటర్లందరినీ చైతన్యపరచి సజావుగా ఓటింగ్ సాగేలా చేస్తూ పోలింగ్ శాతం పెంచడానికి కృషి చేస్తారని, బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగకుండా పోలీస్ అధికారులకు సహకరించి సజావుగా ఎన్నికలు జరిపించుటకు మా వంతు కృషి చేస్తామని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారు ఎన్నికల నిఘా వేదికకు సంపూర్ణ సహకారాలు అందించి మీ సేవలు ఉపయోగించుకుంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు ఎన్నికల నిఘా వేదిక పోస్టర్లను రిలీజ్ చేశారు.

ఎస్పీ గారికి మొక్కను అందజేసిన DR భాస్కర్ నాయుడు.
జిల్లా ఎస్పీ గారు ఎన్నికల నిఘా వేదిక పోస్టర్లను రిలీజ్ చేశారు.

Leave a Comment