HR9NEWS: పెనుగొండ ఎమ్మెల్యే టికెట్ కోసం పోరాడుతా: బీకే పార్థసారథి
పెనుకొండ టికెట్ కోసం చివరి వరకు పోరాడుతానని మాజీ MLA బీకే పార్థసారథి అన్నారు. నిన్న TDP అధిష్ఠానం ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో పార్థసారథికి కాకుండా సబితమ్మకు టికెట్ కేటాయించారు. దీంతో ఆయన అలకబూనారు. ఆదివారం పెనుకొండలోని తన కార్యాలయంలో అనుచరులతో పార్థసారథి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో TDP ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్నీ నిర్వహించానని, తన ఆవేదనను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.
