జగనన్న స్పందించుకుంటే- వైయస్సార్ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపడతాం-: హిందుపురం బి బ్లాక్ కన్వీనర్ నరేష్

జగన్ కోసం ఊపందుకున్న సంతకాల ఉద్యమం-
హిందూపురం నుండి జగన్ పోటీ చేయాలి-

ప్రజల ఆశయాల కోసం జగన్ హిందూపురం నుండి పోటీ చేయాలి– లేదా హిందూపురం అభివృద్ధిపై మాట ఇవ్వాలి

జగన్ స్పందించుకుంటే- వైయస్సార్ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపడతాం-: బి బ్లాక్ కన్వీనర్ నరేష్

గత 5సంవత్సరాలుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కులమత పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి అందరి మదిలో నిలిచారని అయితే స్థానిక అధికార పక్షం నాయకులు ప్రతిపక్షం నాయకులు నిర్లక్ష్య కారణంగా హిందూపురం అభివృద్ధి కి ఆమడ దూరంలో ఉందని పట్టణ ప్రజలు వాపోతున్నారు, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి మెడికల్ కళాశాల, జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడం జరిగిందన్నారు, అయితే స్థానిక వైసిపి పాలకుల అలసత్వం, ప్రతిపక్ష పార్టీ నాయకుల అశ్రద్ధ కారణంగా రెండును చేజారి పోవడం జరిగిందన్నారు, దీంతో జరగబోవు ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి హిందూపురం నుండి పోటీ చేయాలని కోరుతూ వైసిపి బి బ్లాక్ కన్వీనర్ నరేష్ ఆధ్వర్యంలో హిందూపురం పట్టణంలో చేపట్టిన లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం సజావుగా సాగుతుంది.

జగన్ రావాలి, జగన్ కావాలి, హిందూపురం నుండి జగన్ పోటీ చేయాలని కోరుతూ హిందూపురం పట్టణంలో ఆయా ప్రాంతాల్లో స్వచ్ఛందంగా సంతకాలు చేసి వాటి ప్రతులను బి బ్లాక్ కన్వీనర్ నరేష్ కు అందజేస్తున్నారు, గత వారం రోజులుగా నిర్వహిస్తున్న సంతకాల సేకరణ కార్యక్రమం అన్ని ప్రాంతాలలో ఊపందుకుంది,ఈ సందర్భంగా శనివారం వైసిపి బి బ్లాక్ కన్వీనర్ నరేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.

హిందూపురం ప్రాంత అభివృద్ధి కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జగన్ హిందూపురం నుండి పోటీ చేయాలని విన్నవించుకోవడం జరిగిందన్నారు,అన్ని వర్గాల వారికి అభివృద్ధి పరుపరుస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి హిందూపురం నుండి పోటీ చేస్తే అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని తద్వారా హిందూపురం ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ఈ విషయం నియోజవర్గ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారన్నారు, ఇందులోతమ స్వార్ధ ప్రయోజనాలు ఏమాత్రం లేవని హిందూపురం ప్రాంత అభివృద్ధి కోసం ప్రజల విన్నపాన్ని సంతకాల రూపేనా సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు.

జగన్ కోసం గతంలో అనేక పోరాటాలు చేశామని ప్రస్తుతం ఇక్కడ నుండే జగన్ పోటీ చేయాలని ప్రజల కోరిక మేరకు సంతకాల ఉద్యమం చేపడుతున్నప్పటికీ ఇంతవరకు ఎలాంటి స్పందన లేదన్నారు, ఏదేమైనప్పటికీ హిందూపురం నుండి జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలి లేనియెడల హిందూపురం అభివృద్ధిపై ఖచ్చితమైన మాట ఇస్తే అందరూ ఐకమత్యంగా కలిసిమెలిసి హిందూపూర్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని పేర్కొన్నారు, లేనియెడల హిందూపురం పట్టణంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద సోమవారం రిలే నిరాహార దీక్ష పడతానని ఆయన హెచ్చరించారు,

Leave a Comment