నెల 4 (మంగళ వారం)న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కారణంగా ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత, ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు.

నన్నయ వర్శిటీ వద్ద భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎస్పీ జగదీశ్
దివాన్‌చెరువు నుంచి రాకపోకలు నిషేధం
బెజవాడ టూ విశాఖ వాహనాలకు బ్రేక్
ఉదయం 4 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
రాజమహేంద్రవరం ఈ నెల 4 మంగళ వారం న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కారణంగా ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత, ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. సిబ్బంది తమకు కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే వాహనాలను నిలుపుకోవాలన్నారు. ట్రాఫిక్ ఆంక్షలు మంగళ వారం ఉదయం 4గంటల నుంచి అమల్లో ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.
దివాన్ చెరువు సమీపంలోని జీరో పాయింట్ నుంచి రాజాగనరం దుర్గమ్మ గుడి జంక్షన్ మధ్య జాతీయ రహదారిపైకి ఎలాంటి వాహనా లకూ అనుమతి ఉండదు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలి.
విజయవాడ వైపు నుంచి విశాఖ వైపు వెళ్లే భారీ వాహనాలను దేవర పల్లి డైమండ్ జంక్షన్ వద్ద ఉన్న ఖాళీ స్థలంలో 4వ తేదీ తెల్లవారు జా మున 4 గంటల నుంచి తదుపరి అనుమతిచ్చే వరకూ నిలిపివేస్తారు.
విశాఖపట్నం నుంచి చెన్నై వైపు వెళ్లే భారీ వాహనాలు కత్తిపూడి నుం చి పిఠాపురం, కాకినాడ,యానాం, అమలాపురం, మొగల్తూరు, అవని గడ్డ, రేపల్లె, ఒంగోలు గుండా ప్రయాణించాలి. హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు రాజానగరం,కలవచర్ల జంక్షన్, ఏడీబీ రోడ్, కాకినాడ, ఎస్ టీ రాజాపురం జంక్షన్,అనపర్తి కెనాల్ రోడ్, కడియం, రావులపాలెం గుండా వెళ్లాలి. హైదరాబాద్, విజయవాడ వైపు వెళ్లే కార్లు, 10 టైర్ల లారీలు,బస్సులు తదితర వాహనాలు నరేంద్రపురం జంక్షన్, నందరాడ, దోసకాయలపల్లి,ఎయిర్‌పోర్టు, కొంతమూరు గుండా ఎన్‌హెచ్ పైకి చేరుకొని యూటర్న్ తీసుకొని కొవ్వూరు మీదుగా ప్రయాణించాలి.
రాజమండ్రి నుంచి విశాఖ వైపు వెళ్లే ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన వాహ నాలు జీరోపాయింట్, కొంతమూరు, ఎయిర్‌పోర్టు, బూరుగుపూడి, దోస కాయలపల్లి, నందరాడ, నరేంద్రపురం జంక్షన్ వద్ద ఎన్‌హెచ్-16పైకి చేరుకోవాలి.విశాఖ నుంచి విజయవాడ వెళ్లే ఆర్టీసీ వాహనాలు నరేం ద్రపురం జంక్షన్, నందరాడ, దోసకాయలపల్లి, బూరుగుపూడి, ఎయిర్ పోర్టు, కొంతమూరు, దివాన్‌చెరువు, జీరోపాయింట్ ద్వారా వెళ్లాలి.
హైదరాబాద్, విజయవాడ వైపు నుంచి విశాఖ వెళ్లే వాహనాలు కొవ్వూరు మీదుగా కొంతమూరు వద్ద హైవేపై సర్వీసు రోడ్డు మీదుగా కిందికి దిగి ఎయిర్‌పోర్టు, బూరుగుపూడి, కోరుకొండ, గోకవరం, కొత్తపల్లి, మల్లిశాల, జగ్గంపేట వద్ద ఎన్‌హెచ్-16కి చేరుకోవాలి.
రావులపాలెం వైపు నుంచి విశాఖ వెళ్లే వాహనాలు లాలాచెరువు, దివా న్ చెరువు,జీరో పాయింట్ వద్ద యూటర్న్ తీసుకొని కొంతమూరు వద్ద హైవే నుంచి సర్వీస్ రోడ్డుకు చేరుకొని ఎయిర్‌పోర్టు, కోరుకొండ, గోకవరం, కొత్తపల్లి, మల్లిశాల, జగ్గంపేట వద్ద ఎన్‌హెచ్-16 ఎక్కాలి.
రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్లే వాహనాలు వేమగిరి, కడియం, ద్వారపూడి గుండా..కాకినాడ నుంచి రాజమండ్రి వచ్చే వాహనాలు సామర్లకోట, బిక్కవోలు, కడియం, వేమగిరి గుండా ప్రయాణించాలి.
కౌంటింగ్ సిబ్బంది..ఏజెంట్లు పార్కింగ్ ఇక్కడే..
కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు, పోటీ చేసిన అభ్యర్థులు, పోలీస్ అధికారులు, సిబ్బందికి పార్కింగ్ స్థలాలను కేటాయించారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుస్తారు.
1.రాజమండ్రి వైపు నుంచి వచ్చే అన్ని రాజకీయ పార్టీల కౌంటింగ్ ఏజెంట్లు దివాన్‌చెరువు వద్ద ఫ్రూట్ మార్కెట్ ఎదురుగా తూర్పు వైపున ఉన్న డీవీబీ రాజు ఖాళీ స్థలంలో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి.
2. రాజానగరం వైపు నుంచి వచ్చే ఏజెంట్లు రాజానగరం దుర్గమ్మగుడి జంక్షన్ వద్ద ఉన్న ఖాళీ స్థలంలో వాహనాలు పార్కింగ్ చేయాలి.
3. రాజమండ్రి, రాజానగరం వైపు నుంచి వచ్చే కౌంటింగ్ ఆఫీసర్స్, సిబ్బంది, మీడియా గైట్ కళాశాల గ్రౌండ్‌లో వాహనాలు పార్క్ చేయాలి.
4. ఆర్‌వోలు,ఏఆర్‌వోలు,అభ్యర్థులు, చీఫ్ ఎలోన్ ఏజెంట్స్ వర్సిటీ మెయి న్ గేట్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో వాహనాలు పార్క్ చేసుకోవాలి.
5. పోలీస్ అధికారులు, ఇతర శాఖల వారు తమ వాహనాలను శ్రీ గణ పతి సచ్చిదానంద గురుదత్త ఆశ్రమంలో ఖాళీ స్థలంలో నిలుపుకోవాలి. అక్కడి నుంచి మెయిన్ గేటు వద్దకు చేరుకోవాలి.
ఇతర నిబంధనలు..
1. గన్‌మ్యాన్‌లు అభ్యర్థులతో పాటు వచ్చి యూనివర్సిటీ గ్రౌండ్‌లో టెంట్‌లో కూర్చోవాలి.ఆయుధాలతో కౌంటింగ్ హాల్ వద్దకు వెళ్లకూడదు.
2. కౌంటింగ్ హాలులోకి సిబ్బంది, ఏజెంట్లు, అభ్యర్థులు,అధికారులు సెల్ ఫోన్లు,ఎలకా్ట్రనిక్ గాడ్జెట్లు, వాటర్ బాటిల్స్, లైటర్లు, సిగరెట్లు తీసుకెళ్లరాదు.
3. కౌంటింగ్ వద్ద డ్రోన్ కెమెరాలతో నిరంతరం గమనిస్తూ ఉంటారు.
విజయోత్సవ ర్యాలీలపై నిషేధం
ప్రశాంత కౌంటింగ్‌కి పకడ్బందీ ఏర్పాట్లు
నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరైనా జైలుకే
కౌంటింగ్ ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ
రాజమహేంద్రవరం, జూన్ 3 ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేయడానికి పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేశామని ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు.కౌంటింగ్ కేంద్రాలు, వివిధ ప్రాంతాల్లో శనివారం పర్యటించి సిబ్బందికి సూచనలు చేశారు. ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చ రించారు. 4వ తేదీన అనవసరంగా రోడ్లపై, వీధుల్లో తిరగడం చేయవద్దని సూచించారు
ఎన్నికల కేసుల్లో నమోదైతే జీవితం ఇబ్బందుల్లో పడుతుం దన్నారు. కౌంటింగ్ కేంద్రాలు, పరిసరాలు పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో ఉంటాయన్నారు. జిల్లా మొత్తాన్నీ లైవ్ స్ట్రీమింగ్ డ్రోన్ కెమెరాలతో నిరంత రం గమనిస్తూ ఉంటామన్నారు. ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలపై నిషేధం ఉందన్నారు. గొడవలు, విద్వేషాలు, అల్లర్లు సృష్టించడం, కవ్వింపు చర్యలకు దిగడం వంటివి చేస్తే వెంటనే అరెస్టు చేస్తామన్నారు
బ్రీత్ ఎనలైజర్ ద్వారా ఆల్కహాల్ టెస్టింగ్ చేసి మద్యం తాగినట్లు తేలితే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.జిల్లాలో సీఆర్పీసీ 144, పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉందన్నారు. ట్రాఫిక్ నియంత్రణ విషయంలో పోలీసులకు సహకరించాలన్నారు. ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులుంటే వెంటనే పోలీ సులకు తెలియజేయాలన్నారు.కౌంటింగ్ ప్రక్రియ సజావుగా పూర్తి చేయ డానికి ప్రతి ఒక్కరూ సహకరించడం తమ బాధ్యతగా భావించాలన్నారు.