T MAHESH
కెటిఆర్ ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్
ఏపీ రాజకీయాలపై స్పందిస్తూ
జగన్ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినా ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు ప్రజలకు మంచి చేసిన వ్యక్తులు ఎంతోమంది ఓడిపోవడం విచిత్రమనిపించిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు వైసీపీ ఓటమి చెందినా 40 శాతం ఓట్లు రావడం సాధారణ విషయం కాదన్నారు.
షర్మిలకు నాయకత్వ లక్షణాలు లేవన్నారు
కేవలం జగన్ను ఓడించడానికి షర్మిలను పావులా వాడుకున్నారని తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమితో జతకట్టడం వలన ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు.
ఎప్పుడూ ప్రజల్లో ఉండే కేతిరెడ్డి ధర్మవరంలో ఓడిపోవడం ఏమిటో అర్ధంకావడంలేదన్నారు ఏపీ ఫలితాలు మాత్రం తనను షాక్కు గురిచేశాయని చెప్పారు గతంలోనూ కేటీఆర్ ఏపీ ఎన్నికల ఫలితాలపై ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు
తెలంగాణలో ఒక లోక్సభ సీటును గెలుచుకోకపోవడంపై కూడా కేటీఆర్ స్పందించారు. తమ ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయన్నారు. ప్రజలతో కలవకపోవడం వలన తాము తెలంగాణలో ఓడిపోయామని కేటీఆర్ చెప్పారు. మా వైఖరి కొంతమేర మార్చుకోవల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు