కాంగ్రెస్ సభకు భారీగా తరలిన పురం కాంగ్రెస్ నాయకులు

అనంతపురం నగరంలో సోమవారం నిర్వహించిన అఖిలభారత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమరభేరి మహాసభకు హిందూపురం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు

ఈ సందర్భంగా రాబోవు ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా లేదా పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలవాలనిఆశిస్తూ అందుకు తగ్గట్టుగా పార్టీ అధిష్టానానికి తమ బయోడేటను అందించిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ కౌన్సిలర్ ఎంఏ రహుఫ్ ఆధ్వర్యంలో హిందూపురం నుండి దాదాపు 200 మంది ఒక బస్సు,15 కార్లలో బయలుదేరి వెళ్లారు, ఈ సందర్భంగా అనంతపూర్ లో జరిగే కాంగ్రెస్ పార్టీ సమరభరి మహాసభ జయ ప్రదం చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రహుఫ్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీగా ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేశారు.

మధ్యాహ్నం 3-30 నిమిషాలకు రహమత్పూర్ కు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ, పిసిసి అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి, భారత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, జాతీయ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ మెంబర్లు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలు చేస్తూ అనంతపురం కు బయలుదేరారు, ఈ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహం, స్వర్గీయ ఇందిరాగాంధీ విగ్రహం, జవహర్ లాల్ నెహ్రూ విగ్రహాలకు పూలమాలవే సి నివాళులర్పించారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో బానసంచారాలు పేల్చుతూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అనే నినాదాలు చేస్తూ పురం ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీగా అనంతపురం కు బయలుదేరారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంకే యూనస్ ,అబ్బ సయ్యద్, పిరుసాబ్, ఆసిఫ్ భాషా( లీగల్ సెల్)బాబా ఫక్రుద్దీన్, మహబూబ్ ఖాన్, ఆసిఫ్ భాష, నయాజ్,ఇద్రిస్, రిజ్వాన్, ఇలియాజ్ విరివిగా మహిళలు పాల్గొన్నారు

Leave a Comment