కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పురం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతా.
— ఎం.హెచ్.ఇనాయతుల్లా వెల్లడి.
హిందూపురం (HR9news)
అఖిలభారత కాంగ్రెస్ పార్టీ మద్దతుతో హిందూపురం అసెంబ్లీ నియోజక వర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి సిద్ధంగా ఉన్నానని స్థానిక సీనియర్ నాయకులు ఎమ్.హెచ్. ఇనాయతుల్లా పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు.ఇటీవల రెండు రోజుల క్రితం బెంగళూరులో జాతీయ నాయకులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పరిస్థితుల గురించి వాకబు చేయడంతో అన్ని విషయాలు వివరించానన్నారు.
జాతీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఎక్కడ అని ప్రశ్నించారని,అందుకు సమాధానంగా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందని వివరించడం జరిగిందని ఇనాయతుల్లా తెలిపారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు రాజధానిలో గల శివాజీ నగర్ ఎమ్మెల్యే రిజ్వాన్ తో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ మంతనాల గురించి చర్చించే విషయానికి వెళ్ళినప్పుడు అదే సమయంలో అఖిలభారత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫరూక్ అబ్దుల్లా తటస్థపడడం జరిగిందన్నారు. అన్ని విషయాలు కూలంకుషంగా చర్చలు జరిపి మల్లికార్జున కార్గే, వైయస్ శర్మలమ్మతో కలిసి అతి తొందరలోనే సమావేశం అవుతున్నట్లు ఆయన తెలిపారు.
అదే సమయంలో రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య ,డీకే శివకుమార్ లతో కలిసి రాజకీయ చర్చలు జరుపబోతున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేయడానికి సిద్ధపడ్డానని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి బి.ఫామ్ అందిన తక్షణమే ప్రజా క్షేత్రంలోకి వెళ్లి ప్రజల ఆశీర్వాదం తీసుకుంటానని తెలిపారు. హిందూపురం నియోజకవర్గ ప్రజలు తనను తప్పకుండా ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా నా విజయానికి కృషి చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.



