కల్లూరులో ఘనంగా భద్రకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట

కల్లూరులో ఘనంగా భద్రకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట
లేపాక్షి మండలం కల్లూరు గ్రామంలో గురువారం ఆశేష భక్తుల నడుమ, వేదమంత్రాలతో శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో నూతనంగా భద్రకాళి అమ్మవారి మూల విరాట్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంతో చారిత్రక చరిత్ర గల వీరభద్ర స్వామి ఆలయంలో వీరభద్ర స్వామి వారు ఒక్కరే కొలవదీరారు,, ప్రస్తుతం దాతల సహాయ సహకారాలతో వీరభద్ర స్వామి సతీ సమేతంగా నూతనంగా భద్రకాళి అమ్మవారి మూల విరాట్ విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వేదమంత్రాలతో గణపతి పూజ, సుబ్రహ్మణ్యం పూజ, గంగపూజ కలశపూజ, నవగ్రహ హోమాలు, మృత్యుంజయ హోమాలు పూర్ణాహుతి హోమాలు నిర్వహించారు, శ్రీ వీరభద్ర స్వామి, భద్రకాళి అమ్మ వారి మూల విరాట్ విగ్రహాలకు అభిషేకాలు అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించి, వివిధ రకాల పూలంకరణ తో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక భక్తాదులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు పాల్గొని అమ్మవారికి పూజలు గావించి తమ భక్తిని చాటుకున్నారు, భక్తాదులకు తీర్థ ప్రసాదాలు అన్నదానం గావించారు,

కల్లూరులో ఘనంగా భద్రకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట

Leave a Comment