అందరి సహకారంతోనే ప్రశాంతంగా కౌంటింగ్

T Mahesh

అందరి సహకారంతోనే ప్రశాంతంగా కౌంటింగ్

ఎస్పీ మాధవరెడ్డి

శ్రీ సత్యసాయి జిల్లా

కౌంటింగ్ ప్రశాంతంగా ముసేందుకు బాధ్యతగా  భద్రత చర్యలు చేపట్టిన పోలీసుల అందరికీ, కృతజ్ఞతలు,
అదేవిధంగా … కౌంటింగు ప్రశాంతంగా జరిగేలా సహకరించిన జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు.

శ్రీ సత్యసాయి  జిల్లాలో నిన్నటి రోజున  కౌంటింగు బందోబస్తు విధుల్లో పాల్గొన్న పోలీసు సిబ్బంది, కేంద్ర, రాష్ట్ర సాయుధ  బలగాలు, అందరూ సమిష్టిగా పనిచేయడం  వల్లనే జిల్లాలో కౌంటింగు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందన్నారు. ప్రతీ ఒక్కరు  అంకితభావం, చిత్తశుద్ధితో పని చేయడం హర్షనీయమన్నారు.

  కీలక ఘట్టమైన కౌంటింగు ప్రశాంతంగా ముగించేలా ఉత్తర్వులు జారీ కావడంతో పాటు అదనంగా బలగాలు రావడం జరిగిందన్నారు. వీటివల్ల కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎంతో దోహద పడిందన్నారు

కౌంటింగు రోజున అవాంఛనీయ ఘటనలు తలెత్తే అవకాశం ఉండొచ్చని అనుకున్నారు. అయితే ప్రశాంతంగా ముగియడం శుభ పరిణామమన్నారు. ఇదే స్ఫూర్తితోనే ఎలాంటి సంఘటన తలెత్తకుండా  జిల్లాను ప్రశాంతంగా ఉంచుదామని పిలుపునిచ్చారు. అదేవిధంగా.. కౌంటింగు ప్రశాంతంగా జరిగేలా సహకరించిన అన్ని వర్గాల ప్రజలకు జిల్లా ఎస్పీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Comment